డోర్నకల్-మిర్యాలగూడ నూతన రైల్వే లైన్ సర్వేకి లైన్ క్లియర్

నల్లగొండ జిల్లా:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుండి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వరకు నూతన రైల్వే లైన్ సర్వేకు దక్షిణమధ్య రైల్వే ఈ నెల 6న అనుమతించింది.సర్వేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.

3 కోట్లు మంజూరు చేసింది.నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది.

Line Cleared For Dornakal-Miryalaguda New Railway Line Survey-డోర్నక

ప్రతిపాదిత సర్వే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ స్టేషన్ల మధ్య జరగనుంది.ఈ మార్గంలోనున్న గొల్లపల్లి,గుర్రాలపాడు, గువ్వలగూడెం,నేలకొండపల్లి,రామచంద్రాపురం, కోదాడ,హుజూర్ నగర్,ఎర్రగుట్ట,వర్క్షాపురంల మీదుగా మిర్యాలగూడ వరకూ సర్వే నిర్వహించనున్నారు.

నూతనంగా 93 కిమీ రైల్వే లైన్,రెండు జంక్షన్లు,8 క్రాసింగ్లు,నేలకొండపల్లి లో హాల్టింగ్,298 హెక్టార్ల భూసేకరణ తదితర వివరాలను సర్వే చేయాల్సి ఉంది.సర్వే పూర్తయ్యాక డీపీఆర్ను దక్షిణ మధ్య రైల్వేకు నివేదిస్తే దాని ప్రాతిపదికగా లైన్ మంజూరు అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Latest Nalgonda News