ఇటీవల లిథువేనియన్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ యూజెనిజస్ కవలియాస్కాస్ ఒక చీమ ఫొటోని అత్యంత క్లోజ్‌గా ఫొటో తీశాడు.ఆ ఫొటో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఎందుకంటే అల్ట్రా క్లోజ్ అప్‌లో ఆ చీమ ముఖం చాలా భయంకరంగా ఉంది.మాన్‌స్టర్ ఏలియన్‌లా కనిపించే ఈ చీమ ఫేస్ ఫొటో నికాన్ ఫొటోగ్రఫీ పోటీలో ఒక అవార్డును కూడా గెలుచుకుంది.2022 నికాన్ స్మాల్ వరల్డ్ ఫోటోమైక్రోగ్రఫీ పోటీలో గెలుపొందిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు చాలా భయపడుతున్నారు.
వామ్మో, సినిమా గ్రాఫిక్స్‌లో కూడా ఇంత వికృతమైన ఆకారాన్ని క్రియేట్ చేయలేరేమో అని కామెంట్లు చేస్తున్నారు.
నికాన్ ఫొటోగ్రఫీ పోటీలో ఇమేజెస్ ఆఫ్ డిస్టింక్షన్‌లో మొత్తం 57 చిత్రాలు ఎంపికయ్యాయి.
వాటిలో కవలియాస్కాస్ తీసిన ఈ చీమ ఫొటో ఒకటి.ఇది 35 డాలర్ల విలువైన ఒక Nikon వస్తువును గెలుచుకుంది.
కవలియాస్కాస్ ఈ చీమను పట్టుకుని మైక్రోస్కోప్ కింద ఉంచాడు.ఆపై ఈ చీమ ముఖాన్ని మైక్రోస్కోప్‌లో ఐదు రెట్లు జూమ్ చేశాడు.
ఈ ఫొటోలో ఎర్రటి కళ్లతో, బంగారు కోరలతో చీమ ముఖం చాలా వికృతంగా కనిపిస్తోంది.

ఇవే చీమలు ఒక మనిషి ఎత్తు ఉంటే వాటిని చూస్తేనే మనం హడలి పోతామని ఒక ఇద్దరు కామెంట్ చేశారు.“ఈ చీమలు ఒక ఎలుక అంత పరిమాణంలో ఉన్నా కూడా అవి మనల్ని ఎంతగానో భయపెడతాయి” అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.చీమల ఫేస్ ఇలా ఉంటుందని మేమేప్పుడూ ఊహించలేదు అని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ ఫొటోని మీరు కూడా వీక్షించండి.







