ఇప్పటికే ‘ సిద్ధం( Siddham Meeting ) ‘ పేరు తో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ.బహిరంగ సభలు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan)మరింత గా పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టారు.
ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను గురించి జనాలకు అర్ధమయ్యేలా ఏ విధంగా వివరించాలి అనే విషయంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు నేడు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు .అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమయత్వం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి ( Tadepalle)సి కె కన్వెన్షన్ లో ఈ మీటింగ్ జరగనుంది.దీనికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీకి చెందిన కీలక నేతలు హాజరుకానున్నారు.
సుమారు రెండు వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో 175 స్థానాలను గెలుచుకోవడమే మన పార్టీ లక్ష్మమని జగన్ వారికి దిశ నిర్దేశం చేయనున్నారు.ఏ మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఏ విధంగా వివరించాలి అనే విషయం పైన జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ,రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీని బలోపేతం చేసే విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం పైన జగన్ సూచనలు చేయనున్నారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కావాలంటే మళ్లీ వైసీపీని అధికారంలోకి త్తతీసుకొస్తేనే సాధ్యం అవుతుంది అనే విషయాన్ని జగన్ వివరించనున్నారు.
పార్టీ రెండోసారి అధికారంలో వస్తుందని వైసీపీ( YCP ) నేతలంతా ధీమాతోనే ఉన్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపైన జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.అలాగే ప్రతిపక్షాలు తమను టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేలా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం పైన జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.ఈరోజు ఉదయం 9:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.