కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధానం దుర్మార్గం

నల్లగొండ జిల్లా:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి దుర్మార్గున్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన పెట్టాల్సిందేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రేస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ సిగ్గుమాలిన చర్య హై కమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందే.బందాలకతీతమే రాజకీయం.

నిబద్దత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు,సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి.తమ్ముడి గెలుపే వెంకట్ రెడ్డి కి ముఖ్యమైతే.

కాంగ్రెస్ కండువా వదిలేయాలి.మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,కాంగ్రెస్ శ్రేణులపై టీఆరెఎస్,బిజెపి నేతలు దాడులకు పాల్పడుతున్నారు.

Advertisement

ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియా కు పోవడం ఎంతవరకు కరెక్ట్ ?.

Advertisement

Latest Nalgonda News