సొంత ఇలాకాలో చిరుమర్తికి చెక్ పెట్టే యోచనలో రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా: ఇంటి మనిషిలా చూసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నమ్మక ద్రోహం చేసి కారెక్కి,ఇప్పుడు కారు కూతలుకూస్తున్న తీరుపై కోమటిరెడ్డి బ్రదర్స్ సీరియస్ గా నజర్ పెట్టినట్లు,ముఖ్యంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ చేసినట్లు,అందులో భాగంగానే ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా రామన్నపేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి, జడ్పీటీసీ పున్న లక్ష్మి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధుల రాజీనామాల వెనక కూడా రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా చక్రం తిప్పినట్టు విశ్వసనీయ సమాచారం.

అలాగే చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి చేరికలోను ఆయన హస్తమే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.తమ సొంత ఇలాకా అయిన నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని, అలాగే తాము రాజకీయ భిక్ష పెట్టిన చిరుమర్తి లింగయ్య తమను మోసం చేసి అధికార పార్టీలో చేరడంతో ఎలాగైనా అతనిని ఓడించి, కోమటిరెడ్డి బ్రదర్స్ సత్తా చాటాలనే కసితో ఉన్నారని టాక్ నడుస్తోంది.

తాను పోటీ చేస్తున్న మునుగోడుతో పాటు నకిరేకల్ లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించనున్నట్లు, అందులో భాగంగానే సోమవారం రామన్నపేటలో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

భారత్ రైస్ లో బరాబర్ మోసం...!
Advertisement

Latest Nalgonda News