పేద విద్యార్థుల భవిష్యత్ ను కాపాడిన కదిరే కృష్ణ

నల్లగొండ జిల్లా:హైకోర్టులో 15 మంది పేద విద్యార్థుల తరపున పోరాడి వారి భవిష్యత్తును కాపాడిన హైకోర్ట్ అడ్వకేట్ డాక్టర్ కదిరే కృష్ణపై ప్రశంసల వర్షం కురిస్తుంది.

నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన పేద బిడ్డలు టెట్ కోసం కొన్ని సంత్సరాలపాటు కష్టపడి చదివారు.

కానీ,తీరా సమయానికి టెట్ కోసం ఫీజ్ కట్టలేక పోయారు.టైం ముగిసే సరికి ఏం చెయ్యాలో తోచక రోధించారు.

ఎవరో ఇచ్చిన సలహా మేరకు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కదిరే కృష్ణని కలిసి తమ భాధ చెప్పుకున్నారు.వారిని ఒదార్చి కేసును హైకోర్టులో వేసి పోరాడి గెలిచి ఆ విద్యార్థులకు టెట్ పరీక్ష ఫీజు కట్టించారు.

వారు ఈ నెల 12 న ఆదివారం జరిగే టెట్ పరీక్ష రాసే అవకాశం కోర్టు ద్వారా ఇప్పించి వారి బంగారు భవిష్యత్తును కాపాడారు.ఇంతకాలం కష్టపడి చదువుకున్నది వృథా అవుతుందని నిరాశలో ఉండగా కేసును గెలిచిపించి పరీక్షలు రాయడానికి సిద్ధమవడం వాళ్ళ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

Advertisement

ఆ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు అడ్వకేట్ కదిరే కృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

Latest Nalgonda News