పవన్ జెండా మోస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ తెలివైన వారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena Alliance ) ఫిక్స్ కావడంతో ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది ప్రచారం చేస్తుండగా ఈ పొత్తు వల్ల పెద్దగా లాభం ఉండదని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.తాజాగా కేఏ పాల్( KA Paul ) టీడీపీ జనసేన పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Ka Paul Sensational Comments On Pawan And Ntr Goes Viral In Social Media Details-TeluguStop.com

ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ మాట్లాడుతూ టీడీపీ అజెండాను జెండాను మోస్తున్న పవన్ కు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయరని చెప్పారు.

టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం అని కేఏ పాల్ అన్నారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తప్పు చేశారని పొత్తుల పేరుతో పవన్ చంద్రబాబుతో స్నేహం చేస్తే ప్రజలు జనసేనకు ఎందుకు ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు.పవన్ చంద్రబాబు వెంట ఉండి తప్పు చేశారని టీడీపీకి దూరంగా ఉంటూ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తెలివిగా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చంద్రబాబు( Chandrababu Naidu ) ఏపీకి ఏం చేశారని పవన్ ఆయనకు మద్దతు ఇస్తున్నారని కేఏ పాల్ ప్రశ్నించారు.చంద్రబాబు విభజన ఏపీలో సీఎంగా పని చేసినా ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తేలేదని రాజధాని నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ తలచుకుంటే మాత్రమే చంద్రబాబుకు బెయిల్ వస్తుందని కేఏ పాల్ కామెంట్లు చేయడం గమనార్హం.

కేఏ పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.కేఎల్ పాల్ చేసిన కామెంట్లలో కూడా వాస్తవం లేకపోలేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేఏ పాల్ కామెంట్లు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

కేఏ పాల్ కామెంట్లపై టీడీపీ, జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube