2019 ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకొని కనీ విని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్నా వైసీపీ( YCP .ఈసారి ఎన్నికల్లో అంతకుమించి అంటూ చెబుతోంది.
కేవలం విజయం మాత్రమే కాదు 175 క్లీన్ స్వీప్ మన టార్గెట్ అని చెబుతోంది.అందుకు తగ్గటూగానే అధినేత జగన్ ప్రణాళికలు కూడా వేస్తున్నారు.
పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులను నిత్యం ప్రజల్లో ఉంచుతూ.ప్రజల దృష్టి వైసీపీపై పడేలా చూస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి సీట్ల కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
నియోజిక వర్గాల వారీగా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే జగన్ ( cm ys jagan ) సీట్లు కేటాయిస్తారా ? లేదా కొత్తవాళ్ళ వైపు మొగ్గు చూపుతారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరినీ కూడా తాను వదులుకునేందుకు సిద్దంగా లేనని చెబుతున్నా జగన్ అందరినీ గెలిపించుకుంటాననే ధీమాతోనే ఉన్నారు.దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు కొంతవరకు వినిపిస్తున్నాయి.కాగా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలమంది జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.దాదాపు 40 మంది వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని స్వయంగా చంద్రబాబే చెప్పుకొచ్చారు.
దీంతో ప్రస్తుతం ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో జగన్ ఎవరెవరికీ సీట్లు కేటాయిస్తారు ? ఎవరెవరిని పక్కన పెడతారు అనేది సందిగ్ధత సొంత పార్టీ ఎమ్మెల్యేలలోనే నెలకొందట.కాగా సీట్ల విషయంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తావిస్తోంది.ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉన్నవారికే జగన్ సీట్లు కేటాయిస్తారని, ప్రజల్లో నమ్మకం లేని వారికి సీట్ల కేటాయింపు ఉండే అవకాశం లేదని కొడాలి( Kodali Nani ) చెప్పుకొచ్చారు.అలాంటి వారు చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళిన తమకేమి నష్టంగాని, భయంగాని లేదని కొడాలి నాని అన్నారు.
అయితే ఒకవేళ చంద్రబాబు( Chandrababu Naidu ) చెబుతున్నట్లుగా 40 మంది ఎమ్మేల్యేలు టీడీపీతో టచ్ లో ఉంటే అలాంటి వాళ్ళు ఏక్షణంలోనైనా పార్టీ మారే అవకాశాలే ఎక్కువ.నిజంగా అదే గనుక జరిగితే వైసీపీకి గట్టి షాక్ తగలడం ఖాయం.
మరి సీట్ల కేటాయింపు విషయంలో జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో చూడాలి.