తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.మహేంద్ర మృతిని రాజకీయం చేయొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
మహేంద్ర మృతి ఘటనపై స్పందించిన వైసీపీ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి మేరుగ నాగార్జున తమను పరామర్శించడమే కాకుండా బాధలో ఉన్న తమకు అండగా నిలిచారని చెప్పారు.ఈ క్రమంలోనే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారని తెలిపారు.దాంతో పాటు ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించి ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
అంతేకాకుండా మహేంద్ర మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కష్ట కాలంలో తమ కుటుంబం వెన్నంటి ఉన్న జగనన్న ప్రభుత్వానికి ఈ క్రమంలో కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మహేంద్ర మృతిని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నామన్నారు.దయచేసి మహేంద్ర మృతి ఘటనను రాజకీయం చేయొద్దని కుటుంబ సభ్యులు విన్నవించారు.అయితే దొమ్మేరు గ్రామంలో చెలరేగిన ఫ్లెక్సీ వివాదంలో దళిత యువకుడు మహేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.