ఐటెల్( Itel ) నుంచి ఐటెల్ ఐకాన్ 2 స్మార్ట్ వాచ్ కు కొనసాగింపుగా ఐటెల్ ఐకాన్ 3 స్మార్ట్ వాచ్ భారత మార్కెట్ లో లాంచ్ అయింది.ఈ వాచ్ లో ఉండే స్టన్నింగ్ ఫీచర్ లతో గురించి తెలుసుకుందాం.
ఐటెల్ ఐకాన్ 3 స్మార్ట్ వాచ్:
ఈ వాచ్ 2.01 అంగుళాల AMOLED డిస్ ప్లే తో వస్తోంది.500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 2.5 డీ కర్వ్డ్ గ్లాస్ తో పాటు ఉంటుంది.బ్లూ టూత్ 5.3 కు మద్దతు ఇచ్చే కాలింగ్ ఫీచర్ తో ఉంటుంది.ఇందులో 150కి పైగా వాచ్ ఫేస్ లను అందించారు.
ఈ వాచ్ 310mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.కేవలం ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా పది రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.ఈ వాచ్ లో SPO2, పీరియడ్ ట్రాకింగ్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా ఫైండ్ ఫోన్, AI వాయిస్ అసిస్టెంట్, వెదర్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.
ఇక ఈ ఐటెల్ ఐకాన్ 3 స్మార్ట్ వాచ్( Itel Icon 3 smartwatch ) ధర విషయానికి వస్తే రూ.1699 గా ఉంది.ఈ స్మార్ట్ వాచ్ షైనీ గోల్డ్, మిడ్ నైట్ బ్లూ, డార్క్ క్రోమ్ లాంటి కలర్ ఆప్షన్ లలో వస్తోంది.
ఈ స్మార్ట్ వాచ్ ఫ్రీ బుకింగ్స్ మార్చ్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.ఫ్రీ ఆర్డర్ చేసుకునే మొదటి 500 కస్టమర్ లకు రూ.100 స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ లభించనుంది.మధ్యతరగతి బడ్జెట్లో స్టన్నింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ భారత మార్కెట్లో( Indian market ) మిగతా స్మార్ట్ వాచ్ లతో పోటీ పడనుంది.