రైతు ఇంటిపై ఐటీ దాడులు.. ఎందుకంటే?  

chennai,income tax department,it raids,farmer house,kadalooru distric,muthukrishanapuram,sugeesh chandran - Telugu Chennai, Farmer House, Income Tax Department, It Raids

సాధారణంగా బడా వ్యాపారులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, పలు ఉన్నత స్థాయి ఉద్యోగుల ఇళ్లల్లో సాధారణంగా ఐటి దాడులు జరగడం మనం చూసి ఉంటాం.కానీ తాజాగా ఓ రైతు ఇంటిలో ఐటి అధికారులు పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు.

TeluguStop.com - It Attacks Farmers House Chennai

గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆస్తులను అమ్మేసిన ఆ రైతుకు ఉన్నఫలంగా గత రెండు సంవత్సరాలలో అపార సంపద రావడంతో ఆ రైతు ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.

కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణాపురం గ్రామానికి చెందిన సుగీష్‌ చంద్రన్‌ మోతుబారి రైతుకి ఒకప్పుడు పంట పొలాలు, ఆస్తులు ఎక్కువగా ఉండేవి.

TeluguStop.com - రైతు ఇంటిపై ఐటీ దాడులు.. ఎందుకంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే క్రమక్రమంగా వీరు ఆస్తులను అమ్ముకొని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అప్పుల్లో కూరుకు పోయిన ఈ రైతు కుటుంబం గత రెండు సంవత్సరాలలో అధిక ఆదాయాన్ని సంపాదించి, తిరిగి భూములను, ఆస్తులను కొనుగోలు చేశారు.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ రైతు కుటుంబం ఉన్నఫలంగా ఇంత ఆస్తులను సంపాదించడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వీరి అభివృద్ధి వెనుక చెన్నై లోని ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న తన కొడుకు, ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న తన కుమార్తె, అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటి పరిశోధనలలో అధికారులు గుర్తించారు.

కరోనా లాక్ డౌన్ కి ముందు అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ అనే వ్యక్తికి సంబంధించిన పురాతన బంగ్లాను కొనడంతో, గత వారం రోజుల నుంచి ఐటీ అధికారులు వీరిపై దృష్టిపెట్టారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి పెద్దఎత్తున ఐటి అధికారులు వీరి ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు.

అయితే తమ కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ను టార్గెట్ చేసి ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.అమాంతంగా పెరిగిన తన సంపద గురించి అధికారులు ఆరా తీస్తూ దర్యాప్తును వేగం చేస్తున్నారు.

అయితే అకస్మాత్తుగా వీరి ఆస్తి పెరగడం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#IT Raids #IncomeTax #Chennai #Farmer House

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు