పవన్ తో సినిమా కమిట్ అవ్వడమే పెద్ద తప్పు అయిందా?

ఇస్మార్ట్‌ శంకర్ సినిమా( ismart shankar ) తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌( Nidhi Agarwal ).ఆ సినిమా వల్ల కెరీర్ లో ఈ అమ్మడు దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి అని అంతా భావించారు.

 Ismart Shankar Heroine Nidhi Agarwal Facing Problem Due To Pawan Movie , Ismart-TeluguStop.com

కానీ మొత్తం రివర్స్ అయింది.అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మడు చాలా తక్కువ సినిమా ల్లో మాత్రమే నటించింది.

ఆ సినిమా లు కూడా బాక్సాఫీస్( box office ) వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఆకట్టుకోని కథ కథనాల వల్ల ఈమె గత సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడం జరిగింది.

అయితే నిధి అగర్వాల్ ఇన్ని ఫ్లాప్స్ పడుతున్నా కూడా పవన్‌ కళ్యాణ్‌ తో నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా పై నమ్మకంగా ఉంది.ఆ సినిమా తర్వాత తాను ఇండస్ట్రీ లో బిజీ అవుతాను అంటూ చాలా నమ్మకంగా కనిపిస్తుంది.

మరి ఆమెకు పవన్( Pawan ) సినిమా ఎంతటి విజయాన్ని తెచ్చి పెడుతుందో తెలియదు కానీ ఆమె సమయం మాత్రం చాలా మిస్ అవుతోంది.పవన్ సినిమా కమిట్‌ అవ్వడం వల్ల ఇతర సినిమా లకు కంటిన్యూ గా ఓకే చెప్పలేని పరిస్థితి.అంతే కాకుండా చిన్నా చితక సినిమా లకు కూడా పని చేయలేని పరిస్థితి నెలకొంది.వీరమల్లు సినిమా( Veeramallu movie ) విడుదల అయిన తర్వాత మాత్రమే కొత్త సినిమా కు కమిట్ అవ్వాలి అనే ఒక కండీషన్ ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

దాంతో నిధి అగర్వాల్‌ ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటుంది అంటూ ఆమె సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారు.ముందు ముందు అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తాయా అంటే అది కూడా నమ్మకం తక్కువే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి పవన్ సినిమా కమిట్ అవ్వడం వల్ల నిధి అగర్వాల్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ఆ ఇబ్బందులు ఎంత వరకు దారి తీస్తాయి అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube