నితిన్ వేణు శ్రీరామ్ కాంబో లో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరో ల్లో నితిన్ ( Nitin )ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి ఇక ఈయన ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Is This The Story Of The Movie Coming In Nitin Venu Sriram Combo, Nithin, Venu S-TeluguStop.com

ఇక దానికి తోడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలతో పాటు గా వేణు శ్రీరామ్( Venu Sriram ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గానే ఈ సినిమా ని అనౌన్స్ చేసారు ఇక ఈ సినిమాకి టైటిల్ గా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అయినా తమ్ముడు సినిమా టైటిల్ ని పెట్టినట్టు గా అనౌన్స్ చేసారు.

ఇక ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు( Dil raju ) ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

 Is This The Story Of The Movie Coming In Nitin Venu Sriram Combo, Nithin, Venu S-TeluguStop.com
Telugu Storynitin, Nithin, Pawan Klayan, Venu Sriram-Movie

ఇక నితిన్ దిల్ రాజు కాంబో లో ఇప్పటికే దిల్, శ్రీనివాస కళ్యాణ్ లాంటి సినిమాలు వచ్చాయి ఇక ఈ సినిమాతో ముచ్చట గా వీళ్లిద్దరు మూడోసారి కలిసి పనిచేస్తున్నారు.ఇక ఈ సినిమా కి డైరెక్టర్ గా వేణు శ్రీరామ్ వ్యవహరిస్తున్నాడు.ఇంతకుముందు కూడా వేణు శ్రీరామ్ తన మూడు సినిమాలని ఇదే బ్యానర్ లో చేసాడు.

ఇప్పుడు ఈ సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఈయన చేసిన ఏ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టలేదు, కానీ వేణు శ్రీరామ్ కి దిల్ రాజు కి మధ్య మంచి బాండింగ్ ఉండటం వల్ల వేణు శ్రీరామ్ ఈ బ్యానర్ లోనే అన్ని సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

Telugu Storynitin, Nithin, Pawan Klayan, Venu Sriram-Movie

అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఇప్పటికే బయటికి వచ్చేసింది.తమ్ముడు సినిమా లో పవన్ కళ్యాణ్( pawan klayan ) వాళ్ల అన్నయ్య డ్రీం ని తీర్చినట్టు గా ఈ సినిమా లో నితిన్ కూడా వల్ల కుటుంబానికి ఒక అండ గా ఉంటూ అన్నయ్య కి విశ్వాసం గా ఉంటూ తమ్ముడు అంటే ఇలా ఉండాలి అనే విధం గా ఉండటం తో పాటు కుటుంబం కోసం ఏం చేసాడు అనేదే సినిమా స్టోరీ అని తెలుస్తుంది.నిజానికి వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమా చేయాలి కానీ అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ లో ఉండటం వల్ల అతను ఆ సినిమా చేయలేకపోయాడు.దాంతో ఈయన కూడా ఆయన కోసం వెయిట్ చేయలేక నితిన్ తో ఈ సినిమా చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube