ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు ? ఏ పార్టీ ఏ కూటమిలో చేరబోతుంది ? అసలు పొత్తుల విషయంలో తెలుగు పార్టీల భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి ? అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా సాగుతున్నాయి.సాధారణంగా రాష్ట్ర పార్టీలు కేంద్ర పార్టీలతో సత్సంబంధాలు ఉండేలా చూసుకుంటాయి.
ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు తెలపడం వల్ల సవ్యంగా నిధుల సరఫరా జరుగుతుందని, కేంద్ర అండదండలు లభిస్తాయని రాష్ట్ర పార్టీలు భావిస్తుంటాయి.అందుకే సాధ్యమైనంత వరకు జాతీయ పార్టీలతో సఖ్యతగానే మెలుగుతూ ఉంటాయి.
కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, బిఆర్‌ఎస్ వంటి పార్టీలు జాతీయ పార్టీలకు దూరంగా ఉంటున్నాయి.
జాతీయంగా బీజేపీ( BJP ) ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్డీయే కూటమికి గాని, అలాగే కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా కూటమికి తెలుగు పార్టీలు సమదూరం పటిస్తున్నాయి.ఏపీలో అధికార వైసీపీ కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తృన్నప్పటికి ఎన్డీయే కూటమిలో మాత్రం సభ్యత్వం లేదు.అలాగే టీడీపీ గత ఎన్నికల ముందు ఎన్డీయే కూటమిలో ఉండి.
ఆ తరువాత బయటకు వచ్చింది.ప్రస్తుతం ఎన్డీయే కూటమికి గాని విపక్ష ఇండియా కూటమికి గాని ఎలాంటి మద్దతు ప్రకటించలేదు.
ఇక తెలంగాణ విషయానికొస్తే. బిఆర్‌ఎస్( BRS party ) మొదటి నుంచి కూడా జాతీయ పార్టీలకు దూరంగా ఉంటూ వస్తోంది.
అయితే భవిష్యత్ లో ఈ మూడు పార్టీలు కేంద్రంలో ఎటు వైపు ఉండబోతున్నాయనేది ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన డిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ద్వారా స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
పార్లమెంట్ ఉభయ సభలలో డిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం లభించగా.రాష్ట్రపతి ఆమోద ముద్రనే తరువాయి.ఈ బిల్లు విషయంలో ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ ఎన్డీయే పక్షాన నిలిచి డిల్లీ ఆర్డినెన్స్ బిల్లు కు మద్దతు ఇచ్చాయి.
కానీ బిఆర్‌ఎస్ మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమికి మద్దతు తెలిపింది.దీంతో కేంద్రంలో ఏ పార్టీ ఎటు వైపు నిలుస్తుందో స్పష్టమైందనేది కొందరి వాదన.
అయితే విపక్ష ఇండియా కూటమికి అనుకూలంగా ఓటు వేసినంత మాత్రాన.ఆ కూటమికి మద్దతిస్తున్నట్లు కాదని, డిల్లీ అర్దేనెన్స్ బిల్లు వల్ల రాష్ట్ర ప్రభుత్వాల అధికారం దెబ్బ తుంటుందనే ఉద్దేశంతోనే విపక్ష ఇండియా కూటమికి అనుకూలంగా ఓటు వేయాల్సి వచ్చిందని బిఆర్‌ఎస్ చెబుతోంది.
దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేదని మరోసారి స్పష్టమైంది.కానీ వైసీపీ, టీడీపీ( TDP )లు మాత్రం ఎన్డీయే దోస్తీ కోరుకుంటున్నాయనేది తాజా పరిణామాలతో ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.