మెగాస్టార్ చిరంజీవి గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.చిరంజీవి నటిస్తే సినిమా హిట్ అనే భావన చాలామందిలో ఉంది.

 Interesting Facts About Megastar Chiranjeevi Details Here Goes Viral , Chiranjee-TeluguStop.com

చిరంజీవి తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగారు.బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తను నటించిన సినిమాల ద్వారా విజయాలను అందుకుని చిరంజీవి ఈ స్థాయికి చేరుకున్నారు.

ఒకవైపు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

1955 సంవత్సరం ఆగష్టు 22వ తేదీన జన్మించారు.1980లో చిరంజీవికి అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది.చిరంజీవి సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం.

అద్భుతమైన నటన, డ్యాన్స్ వల్ల చిరంజీవికి స్టార్ హీరో స్టేటస్ దక్కింది.చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదు 1978 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన రిలీజ్ కావడంతో ఈ తేదీ కూడా చిరంజీవికి ఎంతో ప్రత్యేకం కావడం గమనార్హం.

Telugu Allurama, Chiranjeev, Chiranjeevi, Rudraveena, Tollywood-Movie

తను నటించిన రుద్రవీణ సినిమాలోని నమ్మకు నమ్మకు ఈరేయిని పాట అంటే ఇష్టమని చిరంజీవి గతంలో వెల్లడించారు.తన చేతి రాత అస్సలు బాగుండదని నేను రాసిన దాన్ని నేనే మళ్లీ చదవలేకపోయేవాడినని సమయం దొరికితే చేతిరాత ప్రాక్టీస్ చేసేవాడినని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ హాబీగా మారిపోయిందని చిరంజీవి తెలిపారు.అంజి సినిమా కోసం చిరంజీవి ఒక షర్ట్ ను రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నారు.సౌత్ నుంచి ఆస్కార్ వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం చిరంజీవికి దక్కింది.1987 సంవత్సరంలో జరిగిన ఆస్కార్ అవార్డ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.రెండు బిరుదులు ఉన్న హీరోలలో చిరంజీవి ఒకరు.మొదట చిరంజీవి బిరుదు సుప్రీం హీరో కాగా ప్రస్తుతం చిరంజీవిని మెగాస్టార్ గా ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు.చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా రక్తదానం, నేత్రదానం సాగిస్తున్నారు.త్వరలో సినీ కార్మికుల కొరకు చిరంజీవి ఒక ఆస్పత్రిని కట్టించడానికి సిద్ధమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube