దళిత బంధులో మాలలకు అన్యాయం

నల్లగొండ జిల్లా:దళిత బంధు ఎంపిక ప్రక్రియలో మునుగోడు నియోజకవర్గ మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జాతీయ మాల మహానాడు స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు ఆరోపించారు.

సోమవారం జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మునుగోడులో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తందారులు తరతరాలుగా పాలిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా వాళ్ల సొంత లబ్ధి కోసం,కాంట్రాక్టర్ల కోసం,మునుగోడు నియోజకవర్గంలో మోసం చేస్తూ వస్తున్నారన్నారు.ఇలాంటి పరిస్థితులలో బహుజనులంతా మళ్ళీ మోసపోకుండా ఉండేవిధంగా ప్రయత్నం చేయాలని బహుజనులను గెలిపించుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

అంతేకాకుండా ప్రధాన పార్టీలన్నీ బహుజనులకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.టిక్కెట్ తెచ్చుకున్న బహుజన అభ్యర్థిని గెలిపించుకునే విధంగా బహుజనులు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తూ మూడు ఎకరాల భూమి గానీ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గానీ,ఇస్తామని నేటికి ఇవ్వకపోగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ బీసీలకు వృత్తి విధానం అంటూ గొర్రెలను చేపలను ఇస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారనన్నారు.దళితులకు దళిత బంధు పేరుతో పాటు, విద్యకు దూరం చేస్తూ వారి యొక్క అభివృద్ధిని అడ్డుకుంటూ బర్లని,ట్రాక్టర్లని కొనిచ్చే విధంగా పథకాలను రూపకల్పన చేస్తూ వారికి విద్యా వ్యవస్థను దూరం చేస్తున్నారని,అంతే కాకుండా మునుగోడు నియోజకవర్గం మొత్తం దళిత బంధుని ఏకకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Advertisement

అగ్రవర్ణాధిపత్య కులాలకు ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా మేము ఓడించి తీరుతామని ఆయా పార్టీలను హెచ్చరించారు.ఖచ్చితంగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చే విధంగా పార్టీల నిర్ణయం ఉండాలన్నారు.

ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో నేటి వరకు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి దళిత బంధులో ప్రాధాన్యత లేదని స్పష్టం అవుతుందని, కానీ,అధికార పార్టీకి ప్రధానంగా ఒక్కటే చెబుతున్నాం,ఎట్టిపరిస్థితుల్లో మాల సామాజిక వర్గానికి దళిత బంధు ఇవ్వకపోతే మిమ్మల్ని నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని తెగేసి చెప్పారు.దళిత బహుజనులను విస్మరిస్తే మిమ్మల్ని బహిష్కరించవలసి వస్తుందని,దళిత బంధుతో పాటు బీసీలకు మైనార్టీలకు కూడా బీసీ బంధు మైనార్టీ బంధు పెట్టి,వారు ఆర్థికాభివృద్ధి చెందే విధంగా చూడాలని ప్రభుత్వానికి సూచించారు.

గత కొంతకాలంగా ఎస్సి కార్పొరేషన్ నిధులను స్వయం ఉపాధి పథకాన్ని అందుబాటులో లేకుండా చేసి,సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని,ఆ విధంగా లేకుండా అర్హులైన అందరికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ నిధులు కేటాయించి,వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు బోగరి విజయ్ కుమార్, నాయకులు బేరి లింగస్వామి,నాగరాజు,బేరి హరి, తెలగమల మురళి,మహేశ్వర అరవింద్,మంచాల వేణు,జంగిలి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు భాగ్యస్వాములు కావాలి : కలెక్టర్
Advertisement

Latest Nalgonda News