మన తరువాతే చైనా... అమెరికా సరసన మనమే!

అవును, వివిధ అంశంలో మేము గొప్ప అని విర్రవీగుతున్న పక్కదేశం చైనా గర్వాన్ని భారత్( India ) మెల్ల మెల్లగా అణచివేస్తూ వస్తోంది.మొన్నటికి మొన్న జనాభా విషయంలో చైనాను అధిగమించిన భారత్ తాజాగా మరో ఫీట్ సాధించి, డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది.

 Indias Road Network Is The Second Largest In The World , Highway, Construction-TeluguStop.com

అవును, ఇపుడు తాజాగా రోడ్ నెట్‭వర్క్‭లో డ్రాగన్ దేశాన్ని భారత్ అధిగమించింది.దీంతో ప్రపంచంలో ఎక్కువ రోడ్ నెట్‭వర్క్‭ కలిగిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత 2వ దేశంగా భారత్ రికార్డుల్లోకి ఎక్కింది.

గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భారతదేశ రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది, ప్రపంచంలోనే 2వ అతిపెద్దదిగా అవతరించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) ఈ మంగళశారం ప్రకటించారు.

Telugu America, China, Highway, India, Latest, Nitin Gadkari, Telugu Nri, Toll-T

ఈ నేపథ్యంలో అయన మాట్లాడుతూ….”భారతదేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్‌ ఉంది.ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వ్యవస్థ.జాతీయ రహదారుల విషయంలో పెనుమార్పులు వచ్చాయి ఇక్కడ.2013-14లో 91,287 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా.ప్రస్తుతం అవి 1,45,240 కిలోమీటర్లకు పెరగడం విశేషం!” అని గడ్కరి అన్నారు.దేశ రాజధాని ఢిల్లీలో ‘మోదీ ప్రభుత్వానికి 9 ఏళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.

గత తొమ్మిదేళ్లలో ఈ రంగంలో భారత్‌ ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించిందని, అమెరికా తర్వాత భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని గడ్కరి అన్నారు.

Telugu America, China, Highway, India, Latest, Nitin Gadkari, Telugu Nri, Toll-T

ఈ సందర్భంగా టోల్‌ ఆదాయం గురించి కూడా లెక్కలు చెప్పారాయన.2013-14లో 4,770 కోట్ల రూపాయల నుంచి 41,342 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు.2030 నాటికి ఈ టోల్ ఆదాయాన్ని 1,30,000 కోట్ల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా అన్నారు.ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించడానికి సహాయపడిందని, ఇంకా దీన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి గడ్కరి పేర్కొనడం విశేషం.ఇకపోతే గతంతో పోల్చుకుంటే టోల్ ప్లాజాల దగ్గర( Toll Plaza ) ఇపుడు పెద్దగా సమయం వృధా కావడంలేదనే విషయం మీకు తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube