సర్వే: శ్వేతజాతీయులను మించిన ఇండో అమెరికన్ల కుటుంబ ఆదాయం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.పొట్ట చేత పట్టుకుని వెళ్లిన వారు ఆదాయంలో స్థానికుల్నే అధిగమిస్తున్నారు.

 Indian Americans Have Highest Household Income Levels In Nation Averaging $120,0-TeluguStop.com

ఎన్నో సంస్థల సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి.తాజాగా ఆసియన్ పసిఫిక్ అమెరికన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.

భారతీయ అమెరికన్ల సగటు వార్షిక కుటుంబ ఆదాయం 1,20,000 డాలర్లుగా తేలింది.ఇది అమెరికాలో స్థిరపడిన అన్ని జాతులతో పాటు స్థానికుల కంటే ఎక్కువ.

భారతీయ అమెరికన్లలో దాదాపు 7 శాతం మంది ఫెడరల్ దారిద్ర్య రేఖ కంటే దిగువన నివసిస్తున్నారని 2018లో తేలింది.ఈ నివేదిక ప్రకారం ఆ ఏడాది ఒక వ్యక్తి ఆదాయం 12,490 డాలర్లు కాగా, నలుగురు వ్యక్తులున్న కుటుంబ సగటు ఆదాయం 25,750 డాలర్లు.

ఇదే సమయంలో ట్రంప్ హయాంలో అమలు చేసిన పబ్లిక్ చార్జ్ నిబంధనకు తక్కువ ఆదాయం వున్న భారతీయులు భయపడ్డారు.ఇది ఫుడ్ స్టాంప్‌లు, గృహ సహాయం సహా అనేక ప్రభుత్వ ప్రయోజనాలను పొందిన వారికి శాశ్వత నివాసాన్ని నిరాకరిస్తుంది.భారతీయ అమెరికన్లు, ఫిలిప్పినో అమెరికన్లు అత్యల్ప పేదరికం రేటును కలిగివున్నారు.57 శాతం మంది భారతీయులు సొంత ఇంటిని కలిగి వుండగా, 26 శాతం మంది అద్దె ఇంట్లో వుంటున్నారు.మొత్తంగా ఆసియా అమెరికన్ కుటుంబాలలో 11 శాతం మంది దారిద్ర రేఖ కంటే దిగువున వున్నారు.ఇదే సమయంలో బ్లాక్, స్థానిక అమెరికన్ కుటుంబాల శాతం 24.అయితే పేదరికంలో వున్న శ్వేతజాతీయులు పది శాతం కంటే తక్కువే వున్నారు.నివేదిక ప్రకారం 80 శాతం గృహ యజమానులు వారే.

Telugu Annually, America, Donald Trump, Federalpoverty, Indianamericans-Telugu N

ఆధునిక ఇమ్మిగ్రేషన్ విధానం కారణంగా అమెరికాకు వలస వచ్చినప్పుడు వలసదారులు ధనవంతులు, విద్యావంతులయ్యే అవకాశం వుందని నివేదిక పేర్కొంది.2012 నాటికి, 61 శాతం ఆసియా వలసదారులు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కలిగి వున్నారు.మొత్తం అమెరికా జనాభాతో పోలిస్తే ఇందులో ఒకరు మాత్రమే మూడవ వంతు కళాశాల లేదా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు.ఆసియా అమెరికన్లు ఎక్కువ శాతం ఉపాధి ఆధారిత వీసాలను పొందడం కూడా అధిక ఆదాయ సామర్ధ్యానికి దోహదం చేసిందని నివేదిక చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube