ఇండియా కూటమిలో ముసలం పుట్టినట్టేనా ?

నిజానికి ఇండియా కూటమి తొలినాళ్ళ నుంచి ఆ కూటమి రాజకీయ ప్రయాణంపై ఎవరికి అంత నమ్మకం లేదు. మోడి ( Narendra Modi )పై వ్యతిరేకతే లక్ష్యంగా ఏర్పడిన ఈ కూటమి అధికార పంపిణీ దగ్గరో లేక పదవుల పంపిణీ దగ్గరో ముక్కలుగా ఛీలిపోతుందంటూ అనేక మంది రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.

 India Alliance Can Survive Frim Udayanidhi Cyclone , Narendra Modi , Bjp Par-TeluguStop.com

అయితే అక్కడ వరకూ వెల్లకుండానే ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా ఇప్పుడు సనాతన ధర్మం వ్యవహారం కూటమిలో బీటలు రేపినట్లుగా తెలుస్తుంది.ఉదయనిది స్టాలిన్( Udhayanidhi Stalin ) వ్యాఖ్యలపై అనుకూల వ్యతిరేక వర్గాలుగా కూటమి పార్టీలు విడిపోవడం గమనార్హం .ప్రస్తుతానికి అయితే కూటమిలోని పార్టీల అధినేతలు ఈ విషయంపై ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటనలు చేయకపోయినప్పటికీ పార్టీలోని కింది స్థాయి నేతల మాత్రం తలో రకంగా మాట్లాడుతున్నారు.

Telugu Amit Shah, Bjp, Brs, Congress, Narendra Modi-Telugu Political News

కర్ణాటక కాంగ్రెస్( Karnataka Congress ) ఉదయనిధి వాఖ్యలను సమర్థించుకొస్తే, శివసేన మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది .శతాబ్దాల చరిత్ర గల సనాతన ధర్మాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం తగదంటూ ప్రియాంక చతుర్వేది అనే శివసేన నేత ప్రకటించారు.ఒక వైపు ఆర్జెడి అనుకూలంగా మాట్లాడుతుండగా మరోవైపు జెడియు మాత్రం ఎవరి ధర్మాలు మతాలు వాళ్లకు ఉంటాయని ,అనవసరంగా ఇతర ధర్మాల గురించి మాట్లాడటం అనవసరం అంటూ స్పష్టం చేసింది .

Telugu Amit Shah, Bjp, Brs, Congress, Narendra Modi-Telugu Political News

గాంధీ కుటుంబం స్పందించాలని భాజపా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి గాంధీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ విషయంపై మాట్లాడలేదు.అయితే దీనిని ప్రధాని ఎన్నికల అస్త్రంగా మార్చాలని భాజాపా ప్రయత్నిస్తే మాత్రం కూటమి విచ్ఛిన్నమవుతుందనే అంచనాలు వస్తున్నాయి.ముఖ్యంగా మెజారిటీ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమిని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా ( Amit Shah )ఇండియా కూటమి హిందూ మతానికి వ్యతిరేకమంటూ ప్రకటించగా, ప్రధాని మోదీ కూడా దీనిపై మంత్రులు గట్టిగా జవాబు చెప్పాలంటూ సూచించినట్లుగా తెలుస్తుంది.

కూటమి విచ్చినం అవ్వడానికి అనేక కారణాలు అందరూ ఊహించినప్పటికీ హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ కొత్త వివాదంతో కూటమి ఐఖ్యత ప్రశ్నార్థకమయ్యే పరిస్థితిలు ఏర్పడ్డాయి .మరి ప్రస్తుతానికి ఎవరు బహిరంగంగా నోరు మెదపకపోయినప్పటికీ కచ్చితంగా ప్రజాక్షేత్రంలో మాత్రం దీనిపై స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయి అన్న దానిని బట్టి కూటమి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube