భరతనాట్యం చేస్తూ ఏడు కొండలు ఎక్కిన భక్తుడు.. ఇతని భక్తికి ఫిదా అవ్వాల్సిందే!

మామూలుగా దేవుడిపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు.కొందరు కోరిన కోరికలు నెరవేరినప్పుడు స్వామివారికి ఆభరణాలు చేయించడం, లేదంటే డబ్బులు హుండీలో కానుకగా వేయడం, లేదంటే తలనీలాలు సమర్పించడం, అంగప్రదక్షిణ, మోకాళ్ళ ప్రదక్షణ చేయడం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు.

 Devotee Krishna Vasu Traditional Dance In Tirumala Srivari Mettu, Krishna Vasu,-TeluguStop.com

అలా తాజాగా కూడా ఒక భక్తుడు ఏకంగా భరతనాట్యం( Bharatanatyam ) చేస్తూ స్వామి వారి మెట్లు ఎక్కి తన భక్తిని చాటుకున్నాడు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్న విషయానికి వస్తే.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తిరుమలకు( Tirumala ) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా టూరిస్టులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.సామాన్యులు రాజకీయ నాయకులు( Politicians ) సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

ఏడాదికి 365 రోజులు ఉంటే అన్ని రోజులు కూడా తిరుమల భక్తులతో రద్దీగానే ఉంటుంది.అయితే నరక మార్గంలో వెళ్లేవారు బస్సు మార్గంలో కార్ల మార్గంలో వెళ్తూ ఉంటారు.

కానీ నిత్యం లక్షలాదిమంది కాలినడకన తిరుమలకి చేరుకుంటూ ఉంటారు.ఏడుకొండలు ఎక్కి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు వారి భక్తిని చాటుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే కొందరు ఏడుకొండలు మోకాళ్లపై ఎక్కితే, మరికొందరు పసుపు కుంకుమ రాస్తూ ఏడుకొండలు ఎక్కుతూ ఉంటారు.ఇంకొందరు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగిస్తూ వెళ్తూ ఉంటారు.ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్వామి వారిపై ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు.అయితే తాజాగా తిరుమలలో ఒక వ్యక్తి భరతనాట్యం చేస్తూ ఏడుకొండలు ఎక్కి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు.

అది కూడా 75 నిమిషాలలో తిరుమల ఏడుకొండల ను భరతనాట్యం చేస్తూ పూర్తి చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.మామూలుగా వెళ్లడానికి ఆ కొండలు ఎక్కడానికి చాలామంది నాన్న అవస్థలు పడుతూ ఉంటారు.

అలాంటిది ఆ వ్యక్తి భరతనాట్యం చేస్తూ 75 నిమిషాలలో తిరుమల కొండ ఎక్కడం నిజంగా చాలా గొప్ప విషయం అని కొనియాడుతున్నారు.అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ భక్తుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ కృష్ణ వాసు అని తెలుస్తోంది.పల్నాడు లోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ( Sri Venkateswara Vedic Peetha )ఆధ్వర్యంలోని కోటప్పకొండ విద్యాలయంలో సంస్కృతం టీచర్ గా పని చేస్తున్నారు.

తనకు వచ్చిన భరతనాట్యం చేస్తూ శ్రీవారి ముక్కు చెల్లించుకోవాలి అనుకొని ఈ విధంగా ఏడుకొండలు భరతనాట్యం చేస్తూ 75 నిమిషాల్లోనే కొండను ఎక్కేసాడు.

https://www.facebook.com/watch/?v=192840453479205&ref=sharing
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube