కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్స్ ఆవిష్కరణ...

నల్లగొండ జిల్లా: నేటి నుండి 14 వరకు ఉస్మానియా అరుణతార, ఇండియన్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలు దేశ వ్యాప్తంగా జరపండనిపి.డి.

ఎస్.యు నల్లగొండ జిల్లా కార్యదర్శి పోలె పవన్,జిల్లా నాయకుడు ఇందూరు మధు పిలుపునిచ్చారు.

విప్లవ విద్యార్థి నాయకుడు, ఉస్మానియా అరుణతార, ఇండియన్ చేగువేరా, యువ మేధావి,ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్,పి.డి.ఎస్.యు.వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్ ను సోమవారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ఎస్సీ హాస్టల్ లో పి.డి.ఎస్.యు.నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోయిన మతఛాందస వాదాన్ని, దుర్మార్గపు ఆధిపత్యాన్ని, దునుమాడిన అగ్నికణం జార్జిరెడ్డిఅని కొనియడారు.

Inauguration Of Comrade George Redd 's 51st Death Anniversary Posters... Death A

"జీనా హైతో మరణ సీఖో-కదం కదం ఫర్ లడనా సీఖో నినాదం"తో విద్యార్థుల సమస్యలపై సమర శంఖం పూరించాడని గుర్తు చేశారు.జార్జిరెడ్డిని అంతమొందించిన మతోన్మాదం నేడు రాజ్యమేలుతూ విద్యార్థుల,ప్రజల కనీస హక్కులను కాలరాస్తుందని,విద్య కాషాయీకరణ చేయడానికి,తద్వారా మేధావులను తయారు చేసే విద్యావిధానంలో మూఢత్వాన్ని నింపడానికి కుట్రపన్నుతున్నారని,అందులో భాగంగానే NEP-2020 ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు.

ఈ విధానాలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఈ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలన్నారు.రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతున్నారని, సామాన్యులు జీవించలేని స్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

విద్యార్థులను మూఢత్వంలో ముంచి విద్య కాశాయికరిస్తే తప్పేంటని నగ్నంగా మాట్లాడన్నారని,భూత విద్య కోర్స్ ప్రవేశ పెట్టుతున్నారన్నారు.నేడు జార్జిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే, ప్రభుత్వ,ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమేనని అన్నారు.

విద్యార్థి, యువతరం జార్జి స్పూర్తితో కదం తొక్కాలని పిలుపునిచ్చారు.జార్జి మరణించినా జార్జి ఆలోచనలు రాష్ట్ర,దేశ విద్యార్థి లోకానికి వెలుగు దారి చూపుతూ ఉంటాయని,విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో జార్జిరెడ్డి సదా బతికే ఉన్నాడని,జార్జి వారసత్వంతో మనమంతా ప్రగతిశీల భావాలతో పోరాడాలన్నారు.

జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను దేశ వ్యాప్తంగా జయప్రదం చెయ్యాలని కోరారు.ఏప్రిల్ 10 నుండి 14 వరకు జరిగే జార్జిరెడ్డి సభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు ఎమ్.సిద్దు, బి.సతీష్,డి.వాసు, ఆర్.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

కిట్టు,ఏ.శ్రీకాంత్, ఎస్.రాజు,పరమేశ్వర్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Press Releases News