ఏపీలో సమగ్ర సర్వే పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరుగుతోందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు.
రాష్ట్రంలోని విలువైన భూములను కొత్త విధానాలతో జగన్ ప్రభుత్వం దోచేస్తుందని విమర్శించారు.
దాదాపు రెండు లక్షల ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో పెట్టి అధికారులతో బెదిరింపులు చేయిస్తున్నారని బోండా ఉమ తెలిపారు.
భూములను 22ఏ చట్టం నుంచి తొలగించడం కోసం సెటిల్ మెంట్ ల పేరుతో కోట్లు కొట్టేశారని చెప్పారు.ఈ క్రమంలో 22ఏ లో రెండు లక్షల ఎకరాలు ఎందుకు పెట్టారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎప్పటి నుంచో నిషేధిత జాబితాలో ఉన్న భూములను 22ఏ పరిధి నుంచి ఎందుకు తొలగించారో కూడా తేలాలన్న ఆయన అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు.