ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటనలు చేపట్టారు.
వచ్చే ఎన్నికలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి వంటి విషయాలపై అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది.ఇదే సమయంలో బోగస్ ఓట్లపై తెలుగుదేశం( TDP ) వర్సస్ వైసీపీ( YCP ) మధ్య వివాదం కూడా నెలకొంది.
ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకున్నారు.అయితే అవకతవకులు జరిగిన చోట్ల ఎలక్షన్ కమిషన్( Election Commission ) పలువురు అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది.
ఇదే సమయంలో నేడు ఏపీ ఓటర్ లిస్ట్( AP Voter List ) తుది జాబితా విడుదల చేసింది.పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్( AP CEO Mukesh Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.2024 ఓటర్ల తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందించినట్లు స్పష్టం చేశారు.ఈ తుది జాబితాలో పేరు లేని వారు.18 ఏళ్లు నిండిన వారు.ఎన్నికల నామినేషన్ చివరి తేదీ లోగా దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు లభిస్తోంది.ఇదే సమయంలో రాజకీయ పార్టీలు ఎవరి పేరు అయినా లేనట్లు గుర్తిస్తే మా దృష్టికి తీసుకురావాలి అని సూచించారు.80 ఏళ్లు నిండిన వృద్ధులు, వికలాంగులు ఈసారి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది అని ముఖేష్ కుమార్ స్పష్టం చేశారు.