36 లక్షల జాబ్ వదిలి సివిల్స్ వైపు అడుగులు. మూడుసార్లు ఫెయిల్.. రాబిన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

సాధారణంగా మనలో ఎవరైనా 36 లక్షల రూపాయల వేతనంతో జాబ్ అంటే ఎగిరి గంతేస్తారు.ప్రస్తుత కాలంలో నెలకు 3 లక్షల రూపాయల వేతనం అంటే సులువు కాదు.

 Iit Graduate Turns Down Rs 36 Lakh Job Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఐఏఎస్ కావాలనే కల కోసం రాబిన్ బన్సాల్ తన లక్ష్యం కోసం 36 లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు.ఎంతో కష్టపడి ఐఏఎస్ కావాలని అనుకున్న కలను నెరవేర్చుకున్నాడు.

రాజస్థాన్ ( Rajasthan )రాష్ట్రంలోని లెహ్రా అనే చిన్న పట్టణానికి చెందిన రాబిల్ బన్సాల్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.

Telugu Job, Civils, Iit Delhi, Rabin Bansal, Rajasthan, Robin Bansal-Latest News

మంచి మార్కులతో ఇంటర్ పాసైన రాబిన్ జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ వైపుగా అడుగులు వేశారు.ఐఐటీ ఢిల్లీ( IIT Delhi )లో సీటు వచ్చిన సివిల్స్ పై రాబిల్ బన్సాల్( Robin Bansal ) దృష్టి పెట్టారు.కాలేజ్ ప్లేస్ మెంట్స్ లో ప్రముఖ కంపెనీలో 36 లక్షల రూపాయల వేతనంతో జాబ్ వచ్చినా తన లక్ష్యం జాబ్ కాదని రాబిల్ బన్సాల్ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

కుటుంబ సభ్యులను సైతం ఒప్పించి 2019 సంవత్సరంలో రాబిన్ బన్సాల్ ప్రిపరేషన్ ను మొదలుపెట్టారు.

Telugu Job, Civils, Iit Delhi, Rabin Bansal, Rajasthan, Robin Bansal-Latest News

2019 సంవత్సరంలో సివిల్స్ కోసం మొదటిసారి పరీక్ష రాయగా ఆశించిన ఫలితాలు రాలేదు.రెండోసారి మరింత కష్టపడి ప్రయత్నించినా ఫలితం మాత్రం అదే విధంగా వచ్చింది.మూడో ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయినా రాబిన్ మాత్రం కచ్చితంగా సక్సెస్ సాధించాలని రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించారు.

నాలుగో ప్రయత్నం సమయంలో రోజుకు 10 గంటల పాటు రాబిన్ కష్టపడ్డారు.నాలుగో ప్రయత్నంలో ఆలిండియాలో 135వ ర్యాంక్ రాబిన్ సొంతమైంది.తన సక్సెస్ గురించి రాబిన్ మాట్లాడుతూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలే తప్ప నిరాశకు గురి కావద్దని చెప్పుకొచ్చారు.మన బలం, బలహీనతల గురించి తెలుసుకోవాలని వాటికి అనుగుణంగా వ్యూహాన్ని రూపొందించి అనుసరించాలని బన్సాల్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube