కలియుగ దైవం ఏడుకొండలవాడుగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం.శనివారం స్వామివారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయని అందరూ విశ్వసిస్తుంటారు.
శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించి పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.ఇలా ఏడు శనివారాలు పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు.
అయితే వెంకటేశ్వర స్వామి నిలయంగా తిరుపతి ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
ఇక్కడ ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.
దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు.తెలుగు రాష్ట్రాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని అందరి విశ్వాసం.
శనీశ్వరుడు ఈ పేరు వినగానే చాలా మందిలో ఒక రకమైన భయానికి గురవుతారు.శనిని పూజించడం వల్ల శని కలుగుతుందని అపోహలో ఉంటారు.
అయితే ఇది కేవలం అపోహ మాత్రమే.భక్తి శ్రద్దలతో శనీశ్వరుని పూజించడం ద్వారా ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతున్న శని ప్రభావం తగ్గడమే కాకుండా, సుఖ సంతోషాలను కలిగి ఉంటారు.
శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.శని త్రయోదశి రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
అలాగే నల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది.ఏడవ శనివారానికి అధిపతి శనేశ్వరుడు.
సంఖ్యాపరంగా కూడా ఏడు శనీశ్వరుని కి ప్రీతికరమైన సంఖ్య.శనీశ్వరుడు శివుని యొక్క అంశంతో పుట్టిన వాడు కనుక శనీశ్వరుడు అని మాత్రమే పిలవాలి.
కొందరు శని, శని అని పిలుస్తూ ఉంటారు.అలా పిలవడం మంచిది కాదు.