మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలంటే తిండి, నీళ్ళతో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం.మనం ప్రతి రోజు మన శరీరానికి అవసరమయ్యే నిద్ర పోయినప్పుడు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలము.
అయితే చాలా మంది పడుకునే సమయంలో కూడా వివిధ భంగిమలలో పడుకుంటారు.ఇలా ఎవరికి అనుగుణంగా వారు నిద్ర పోయినప్పటికీ మనం నిద్రపోయే సమయంలో కొన్ని వస్తువులు మన దరిదాపుల్లోకి కూడా ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ వస్తువులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిద్రపోయే సమయంలో మన బెడ్ దరిదాపుల్లో కూడా మన వాలెట్ ఉండకూడదని చెబుతున్నారు.
ఇలా వాలెట్ మన దగ్గర ఉండటం వల్ల మనం నిద్ర పోతున్న మన తలలో పర్సులో డబ్బు ఉంది అనే భావన కలిగిస్తూ ఉంటుంది.దీనివల్ల నిద్రపోయినా మనకి శాంతి కాకుండా ఎక్కువ అశాంతి కలుగుతూ ఉంటుంది.
అందుకోసమే మనం నిద్రపోయే సమయంలో మన దరిదాపుల్లో డబ్బులు ఉండకుండా చూసుకోవాలి.అలాగే చాలామంది ప్రస్తుతకాలంలో వారికి నిద్ర వచ్చేవరకు మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు.
ఇలా చూడటం మంచిది కాదని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ సెల్ ఫోన్ పక్కన లేకపోతే నిద్ర రాదు.ఇలా మొబైల్ ఫోన్ చూడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అని చెప్పవచ్చు.

పడుకునేటప్పుడు మన దరిదాపుల్లోకి వార్తాపత్రిక లేదా ఏదైనా పుస్తకాలను ఉంచ కూడదని పర్యావరణ విద్యావేత్తలు తెలియజేస్తున్నారు.ఇలా పుస్తకాలను నిద్రపోయే సమయంలో మన దగ్గర ఉంచుకుంటే సరస్వతీ దేవిని అవమానించినట్లే అని అర్థం.ఇక చాలామంది ఇంటిలో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఈ క్రమంలోనే పడకగదిలో కూడా చెప్పులు ధరిస్తుంటారు.ఇక నిద్రపోయేముందు చెప్పులు లేదా బూట్లను మంచం కింద వదిలి నిద్రపోతారు.
ఇలా పడకగదిలో మంచం కింద చెప్పులు ఉండడం మంచిది కాదని వాస్తునిపుణులు తెలియజేశారు.ఇలా పడుకునే సమయంలో ఈ విధమైనటువంటి వస్తువులు దరిదాపుల్లో ఉండటంవల్ల అశాంతి కలుగుతుంది కనుక వీటిని దూరంగా ఉంచండి.