శ్రీ క్రోధి నామ సంవత్సరం( Sri Krodhi Nama Samvatsara ) ఉగాది పండుగ నుంచి మొదలుకానుంది.తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుందని దాదాపు చాలా మందికి తెలుసు.
దీని వల్ల ఇప్పటికే దాదాపు చాలా మంది ప్రజలు కొత్త సంవత్సరం తమకు ఎలా ఉంటుందో అని చర్చించుకుంటూ ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా దీని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి.
అయితే కొత్త పంచాంగం ప్రకారం మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత రాజయోగమే అని పండితులు చెబుతున్నారు.మరి ఆ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

శ్రీ క్రోధి నామ సంవత్సరం మేష రాశి( Mesha Rashi ) వారికి ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుంది.బృహస్పతి ధన స్థానంలో సంచరించడం, శని లాభ స్థానంలో సంచరించడం, రాహువు న్యాయస్థానంలో సంచరించడం, కేతువు కూడా ఆరో స్థానంలో అనుకూలంగా సంచరించడం ద్వారా మేష రాశి వారికి ఈ ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుంది.గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.ధన స్థానంలో బృహస్పతి ఉండడంతో ఈ ఏడాది వ్యాపారాలలో ఉన్న వారికి మంచి లాభంగా ఉంటుంది.
ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వాస్తు లాభం, ధన వృద్ధి వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
ఈ సంవత్సరం మేషరాశి జాతకులు ఆర్థికంగా ఎదుగుతారు.ఇక మేష రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని లాభ స్థానంలో ఉంటుంది.
వ్యాపార విషయంలో, నూతన గృహ నిర్మాణ విషయంలో శుభ ఫలితాలు వస్తాయి.అలాగే ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు.
ధైర్యంగా ముందడుగు వేస్తారు.న్యాయస్థానంలో రాహువు ఉండడం ద్వారా కాస్త వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.
ఈ ఏడాది కుటుంబసభ్యుల వల్ల మానసిక సంతోషం కూడా కలుగుతుంది.సినీ రంగాల వారికి కూడా శుభ ఫలితాలు వస్తాయి.