పానీ పూరి ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసిన కొరియన్.. అతని రియాక్షన్ చూస్తే..??

పానీ పూరి( Pani Puri ) అంటే ఇష్టపడని వారు ఉండరు.స్టేట్ ఫుడ్స్ లో బాగా ఇష్టపడే ఫుడ్ పానీపూరి.

 If You See The Reaction Of A Korean Who Tasted Pani Puri For The First Time, Pan-TeluguStop.com

మన ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా దీనికి అభిమానులు ఉన్నారు.ఈ స్నాక్‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు కానీ టేస్ట్ మాత్రం అన్నిచోట్ల అదిరిపోతుంది.

ప్రస్తుతం ఇండియాలో లాగానే విదేశాల్లో కూడా ఈ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు.టేస్ట్ చేసి ఇండియన్ డిష్ ఎలా ఉందో రివ్యూలు కూడా చెబుతున్నారు.

ఇలాంటి రివ్యూ అండ్ రియాక్షన్‌కి సంబంధించిన ఓ వీడియో తాజాగా ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

ఈ వీడియోలో ఒక కొరియన్ వ్యక్తి( Korean man ), అతని భారతీయ స్నేహితుడు ఇంట్లో పానీ పూరి తయారు చేస్తున్నారు.ఈ కొరియన్ వ్యక్తి వ్యాపారి నుంచి కొనుగోలు చేయడానికి బదులుగా స్వయంగా స్నాక్ తయారు చేసే ప్రయత్నాన్ని మెచ్చుకోక తప్పదు.“జిన్జుంగ్ బ్రదర్స్”( Jinjung Brothers ) అనే పేరుతో పాపులర్ అయ్యారు ఈ ఇద్దరు స్నేహితులు.వీళ్లు భారతీయ, కొరియన్ అంశాలతో ఫన్నీ కంటెంట్‌ను క్రియేట్ చేసి ఫాలోవర్లను అలరిస్తుంటారు.వారి రీసెంట్ వీడియోలో వారు రెడీ-టు-ఈట్ పానీ పూరి బాక్స్‌ను తెరిచి, కిట్‌లో అందించిన చట్నీ పేస్ట్ ఉపయోగించి మసాలా నీటిని తయారు చేయడం చూడవచ్చు.

వీడియోలో, వారు పానీపూరిని పూర్తి చేయడానికి స్వీట్ చట్నీ, బూంది వేస్తారు.కొరియన్ వ్యక్తి జాగ్రత్తగా ప్రతి పూరీని మసాలా, పుల్లని మిశ్రమంతో నింపి, తింటాడు.అది చాలా టేస్టీగా ఉన్నట్లు అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా తెలిసింది.అతను చేతులతో కూడా టేస్ట్ బాగుందని చెప్పాడు.అయితే ఈ వీడియో చూసి చాలా మంది సంతోషించారు.ఇండియన్ స్నాక్ ను మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ఇందులో బంగాళదుంప యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube