టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ను ఎలాగైనా ఈసారి తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) టిడిపి అధినేత చంద్రబాబు అక్కడి నుంచే వరుసగా నుంచి గెలుస్తూ వస్తున్నారు.అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఇంటికి పంపాలనే పట్టుదలతో వైసిపి ఉంది అందుకే ఈ నియోజకవర్గంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని పై చేయి సాధించే విధంగా ఈ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలన్నిటిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కి జగన్ అప్పగించారు.
ఈ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా భరత్ ను నియమించి ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు.ఆయనను గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
చిత్తూరు లోక్ సభ పరిధిలోకి వచ్చే ఈ కుప్పం నియోజకవర్గంలో కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలు ఉన్నాయి.జనాభా పరంగా చూస్తే వన్యకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు.ఆ తర్వాత మాల, కురువ , గాండ్ల కులస్తులు ఎక్కువగా ఉంటారు .ఇక్కడ టిడిపి ఆవిర్భావానికి ముందు 5 ఎన్నికలు జరిగాయి.1962 లో కమ్యూనిస్టు పార్టీ, 1967, 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్ లు, 1955 1978లో కాంగ్రెస్ ఇక్కడి నుంచే గెలిచింది.1983లో టీడీపీ( TDP ) ఆవిర్భావం తర్వాత నుంచి ఇక్కడ ఆ పార్టీ హవానే నడుస్తోంది.
టీడీపీ ఆవిర్భావం తరువాత కుప్పం అసెంబ్లీ( Kuppam Assembly constituency ) సీటుకు మొత్తం తొమ్మిది ఎన్నికలు జరిగితే, ఇందులో అన్ని టిడిపిని గెలుచుకుంది.1983 నుంచి 2019 వరకు ఇక్కడ టిడిపినే గెలుస్తూ వస్తోంది.1983 , 85లో టిడిపి అభ్యర్థి రంగస్వామి నాయుడు ఇక్కడ నుంచి గెలవగా ఆ తరువాత ఏడుసార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు.అయితే ఈసారి ఈ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోవాలనే దృఢ సంకంల్పం తో జగన్ ఉన్నారు.