ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ఏడాదిగా 500 కోట్లు ప్రభుత్వం చెల్లింపులు జరపకపోవటంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి ఏడాదిగా 500 కోట్లు ప్రభుత్వం చెల్లింపులు జరపకపోవటంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.
దీంతో ఏపీలోని 450 ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అనుమతిస్తామని తెలిపాయి.బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది.ప్రభుత్వ చర్యలను బట్టి తరువాత తమ నిర్ణయాలు ఉంటాయని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి.