వింటర్ సీజన్ స్టాట్ అయిపోయింది.రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
చలికి ప్రజలు వణికిపోతున్నారు.అయితే ఈ చలి కాలంలో చాలా మందిని గొంతు నొప్పి వేధిస్తుంటుంది.
గొంతు నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంటుంది.ఈ సమయంలో మాట మాట్లాడుతుంటే నొప్పిగా ఉండడం, బొంగురు పోవడం, ఏమి తినలేకపోవడం జరుగుతుంటుంది.
అయితే ఇంతలా ఇబ్బంది పెట్టే గొంతు నొప్పిని కొన్ని చిట్కాలతో ఇంట్లోనే దూరం చేసుకోవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
వెల్లుల్లి.గొంతు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.ఎన్నో ఔషధ గుణాలు ఉండే వెల్లుల్లి అందరి ఇంట్లో ఉంటుంది.అయితే గొంతు నొప్పి వేధిస్తునప్పుడు.
రెండు వెల్లుల్లి రెబ్బలును బుగ్గన పెట్టుకుని.కొంచెం కొంచెం నములుతూ రసం మింగాలి.
ఇలా చేయడం వల్ల అందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.
అలాగే గొంతు బాగా నొప్పిగా ఉన్నప్పుడు.
కొంచం వేడిగా ఉన్న నీటిలో ఉప్పువేసి గొంతుక వరకు వెళ్లేలా పుక్కిలించాలి.ఇలా తరచూ చేయడం వల్ల.
గొంతులోకి వెళ్లిన ఉప్పు నీరు కఫాన్ని తగ్గించి నొప్పిని నివారిస్తుంది.పుదీనా కూడా గొంతు నొప్పిని తగ్గించగలదు.
అందుకే కొన్ని పుదీనా ఆకులను నీటితో వేసి బాగా మరిగించాలి.అనంతరం ఆ నీటిని వడగట్టుకుని.
గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకుంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పిని మరియు జలుబును నివారించడంలో విటమిన్ సి గ్రేట్‌గా సహాయపడుతుంది.
కాబట్టి, కమలా పండ్లు, నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే గొంతు నొప్పితో బాధ పడుతున్న వారు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తప్పకుండా తీసుకోవాలి.
అదేవిధంగా, మిరియాలు కూడా గొంతు నొప్పిని తగ్గించగలవు.కాబట్టి, మిరియాల టీ లేదా మిరియాలను తేనెతో కలిసి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.