కొత్త పార్లమెంట్ భవనం( New Parliament Building )లో మొట్టమొదటిసారిగా చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill )కు ఆమోదం లభించింది.సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించగా.
మంగళవారం లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.ఈ క్రమంలో బుధవారం ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 454 మంది అంగీకారం తెలపగా, ఇద్దరు ‘నో’ అని ఓటు వేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా( Lok Sabha Speaker Om Birla ) ప్రకటించారు.
దీంతో లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది.కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టగా 8 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ క్రమంలో ఓటింగ్ లో 456 మంది పాల్గొనగా 454 మంది అంగీకారం తెలపడం జరిగింది.ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు.అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Minister Amit Shah ) కీలక ప్రకటన చేశారు.2024 ఎన్నికలలో ఈ బిల్లు వర్తించదని పేర్కొన్నారు.జనాభా లెక్కలు, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే ఈ బిల్లు అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.అదేవిధంగా మహిళ రిజర్వేషన్ బిల్లు తమకి రాజకీయ అజెండా కాదని కూడా అమిత్ షా స్పష్టం చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదట మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం లభించడం జరిగింది.