మూవీల కోసం ఎవరూ ఊహించని పనులు చేసిన యాక్ట్రెస్‌లు.. ఏంటంటే..??

కొంతమంది నటీమణులు సినిమా మంచిగా రావాలని తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు.ఏ రిస్కులను పట్టించుకోకుండా పాత్రకు 100% నిజం చేయాలని, సినిమా మంచి హిట్ కావాలని బలంగా కోరుకుంటారు.

 Heroines Hard Work For Movies ,rangasthalam, Samantha, Sriya Reddy, Salaar ,po-TeluguStop.com

అలాంటి నటీమణులు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తిండిపోతారు.ఆ డెడికేటెడ్ యాక్ట్రెస్‌లు ఎవరో తెలుసుకుందాం.

శ్రియా రెడ్డి

Telugu Salaar, Poorna, Prabhas, Rangasthalam, Samantha, Sapthami Gowda, Sriya Re

ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్ 2023లో విడుదలైంది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.ఇందులో ప్రభాస్ టైటిల్ క్యారెక్టర్‌లో చేశాడు.పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.ఇందులో శ్రీయా రెడ్డి( Sriya Reddy ) రాధా రామ పాత్రలో నటించింది.ఈ రోల్ లో ఆమె తన చెవులకు కడియాలు తొడుక్కుంది.

వాటి కారణంగా ఆమె చెవులు సాగిపోయాయి.అయినా ఈ ముద్దుగుమ్మ సినిమా బాగా రావాలని అన్నీ భరించింది.

తర్వాత సర్జరీ చేయించుకుంది.

సమంత

Telugu Salaar, Poorna, Prabhas, Rangasthalam, Samantha, Sapthami Gowda, Sriya Re

సమంత రూత్ ప్రభు( Samantha ) రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ అందాల తార ఈ విలేజ్ డ్రామాలో మాములు అమ్మాయిగా నటించి మెప్పించింది.ఈ సినిమాలో సమంత బర్రెలు కడిగే ఒక సీన్ ఉంటుంది.

ఈ సీన్ ఒక డూప్ తో కంప్లీట్ చేయిద్దాం అని అనుకున్నారు.అయితే సమంత స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా బురదలోకి దిగి బర్రెలను తన సొంత చేతులతో కడిగింది.

పూర్ణ

తమిళం, తెలుగు, మలయాళం వంటి అన్ని భాషల్లోనూ పూర్ణ పాపులర్ అయింది.ఈ ముద్దుగుమ్మ కొడివీరన్‌ సినిమాలో గుండు కొట్టించుకుంది.

సాధారణంగా హీరోలే గుండుకు ఒప్పుకోరు.విగ్‌తో అలాంటి సన్నివేశాలు చేస్తారు.

కానీ పూర్ణ(Poorna ) మాత్రం గుండు గీయించుకుని చాలా పెద్ద షాక్ ఇచ్చింది.సాధారణంగా ఆమె కావాలనుకుంటే ఏదో ఒక విగ్గు పెట్టుకొని ఈ సీన్ చేయవచ్చు కానీ అది ఒక బలమైన పాత్ర అని దానికోసం తన జుట్టు కూడా మొత్తం గీయించుకుంది.

కాంతారా

Telugu Salaar, Poorna, Prabhas, Rangasthalam, Samantha, Sapthami Gowda, Sriya Re

బ్లాక్ బస్టర్ హిట్ కాంతారా లో హీరోయిన్ గా చేసింది సప్తమి గౌడ( Sapthami Gowda )ఈ అందాల తార ఈ సినిమా కోసమే ముక్కుపుల్ల కుట్టించుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఆమె ఒక పాత్ర కోసం ఇలా నొప్పిని భరించడం నిజంగా విశేషం అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube