తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇతర హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అయితే యంగ్ హీరోలందరూ కూడా ఇప్పుడు వరుస సక్సెస్ లను అందుకోసమే ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… ఇక ఇదిలా ఉంటే నితిన్(Nithiin ) లాంటి మీడియం రేంజ్ హీరో కూడా ఇప్పుడు వరుస సక్సెస్ లను అందుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఆయన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘తమ్ముడు ‘ అనే సినిమా చేస్తున్నాడు.
![Telugu Nitin, Nitinvikram, Robin Hood, Tollywood, Vikram Kumar-Movie Telugu Nitin, Nitinvikram, Robin Hood, Tollywood, Vikram Kumar-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Nitin-Vikram-K-Kumar-combo-Nitin-Vikram-K-Kumar-tollywood-social-media-Robin-Hood.jpg)
అలాగే వెంకి కుడుముల డైరెక్షన్లో ‘రాబిన్ హుడ్’ ( Robin Hood)అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ రెండు సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ప్రస్తుతం దానికి తగ్గట్టుగానే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే మరో రెండు సినిమాలకు కూడా తను కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.ఇక ఇష్క్ సినిమాతో తనను మళ్ళీ హిట్టు బాట పట్టించిన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో అడ్వెంచర్ జానర్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
![Telugu Nitin, Nitinvikram, Robin Hood, Tollywood, Vikram Kumar-Movie Telugu Nitin, Nitinvikram, Robin Hood, Tollywood, Vikram Kumar-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Nitin-Vikram-K-Kumar-tollywood-social-media-Robin-Hood.jpg)
ఇక దాంతో పాటుగా ’90 స్ కిడ్స్‘ వెబ్ సిరీస్ జు డైరెక్షన్ చేసిన ఆదిత్య హాసన్ తో కూడా ఒక సినిమా చేసి మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మీద చాలా మందికి మంచి అంచనాలైతే ఉన్నాయి.ఎందుకంటే విక్రమ్ కే కుమార్ ఇప్పుడు వరుస ఫ్లాప్ ల్లో ఉన్నాడు.అలాగే దూత అనే వెబ్ సీరీస్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు.అయినప్పటికీ తను అడ్వెంచర్ జనర్ లో సినిమా చేస్తున్నాడు అంటే అందరికీ ఆసక్తిని కలిగిస్తుందనే చెప్పాలి…
.