ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ప్రస్తుతం పలు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సిటాడెల్ వెబ్ సిరీస్( Citadel ) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Heroine Priyanka Chopra Diamond Necklace Price Details, Priyanka Chopra, Priyank-TeluguStop.com

అద్భుతమైన కథ దొరికితే టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటించడానికి సైతం ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

ప్రియాంక చోప్రా తను ధరించే నగల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023 జరగగా ఈ ఈవెంట్ లో తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా సందడి చేశారు.అయితే ఈ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లస్( Necklace ) సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అయింది.

అయితే ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లస్ విలువ 204 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ఆమె ధరించినట్టు తెలుస్తోంది.ప్రియాంక గతంలో కూడా ఈ ఈవెంట్ కు హాజరు కావడం గమనార్హం.

బ్లాక్ అండ్ వైట్ వాలెంటినో దుస్తులను ధరించి ఆమె సందడి చేయడం గమనార్హం.అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది.

ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సందడి చేస్తున్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో మెట్ గాలా ఒకటి కాగా ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేసే ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రియాంక చోప్రా ప్రస్తుతం కళ్లు చెదిరే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో ప్రియాంక చోప్రా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube