ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ప్రస్తుతం పలు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

సిటాడెల్ వెబ్ సిరీస్( Citadel ) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అద్భుతమైన కథ దొరికితే టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటించడానికి సైతం ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

ప్రియాంక చోప్రా తను ధరించే నగల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023 జరగగా ఈ ఈవెంట్ లో తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా సందడి చేశారు.

అయితే ఈ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లస్( Necklace ) సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అయింది.

అయితే ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లస్ విలువ 204 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

"""/" / బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ఆమె ధరించినట్టు తెలుస్తోంది.

ప్రియాంక గతంలో కూడా ఈ ఈవెంట్ కు హాజరు కావడం గమనార్హం.బ్లాక్ అండ్ వైట్ వాలెంటినో దుస్తులను ధరించి ఆమె సందడి చేయడం గమనార్హం.

అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది.

ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సందడి చేస్తున్నారు.

"""/" / ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో మెట్ గాలా ఒకటి కాగా ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేసే ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం కళ్లు చెదిరే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో ప్రియాంక చోప్రా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆరోగ్యమైన దృఢమైన జుట్టుకు మందారం నూనె.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా?