తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్లకి మంచి గుర్తింపు ఉంది.ఇక మొదటి నుంచి కూడా రైటర్లదే హవా నడుస్తూ వస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో రైటర్ అనగానే ఆయనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.ఒక కథని రాసి దానిని దర్శకుడు కి చెప్పి ఒప్పించి ఆ కథను హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా మళ్లీ మార్పులు చేర్పులు చేస్తూ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంలో తను కీలక పాత్ర వహిస్తాడనే చెప్పాలి.
త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) సినిమా ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో రైటర్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగాడు.దర్శకుడుగా మారి చేసిన సినిమాలు కూడా వరుసగా మంచి విజయాలను అందుకోవడంతో ఆయన ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా( Son Of Satyamurthy )లో ఉపేంద్ర ఒక కీలకపాత్రలో నటించాడు.అయితే ఉపేంద్ర పోషించిన పాత్ర కోసం త్రివిక్రమ్ మొదటగా తెలుగులో స్టార్ హీరో ను సంప్రదించినట్టుగా తెలుస్తుంది.
ఇక ఆయన ఎవరు అంటే విక్టరీ వెంకటేష్ గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర( Hero Upendra Role ) కోసం మొదటగా త్రివిక్రమ్ వెంకటేష్ ని తీసుకోవాలి అనుకున్నాడట.
కానీ అంతకు ముందే వెంకటేష్ మసాలా సినిమా( Venkatesh Masala Movie )లో సేమ్ ఇలాంటి క్యారెక్టర్ నే పోషిస్తు ఉండటం తో ఆ క్యారెక్టర్ ను వెంకటేష్ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో త్రివిక్రమ్ కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర ని ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.దాంతో ఉపేంద్ర కి తెలుగు లో మంచి పేరు వచ్చింది.ఇక దాంతో ఆ తర్వాత ఆయన మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు…
.