ఓవర్సీస్ లో 25 లక్షలకు కొన్నారు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఈ ఏడాది విడుదల అవుతున్న సినిమాలలో చిన్న సినిమాలు బయ్యర్స్ పాలిట కల్ప వృక్షం లాగ మారిపోయింది.ఎందుకంటే ఇప్పటి వరకు విడుదలైన పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాలుగా నిలిచి బయ్యర్స్ కి తీరని నష్టాలను మిగిలించాయి.

 Hero Sree Vishnu Samajavaragamana Movie Box Office Collections Details , Hero Sr-TeluguStop.com

చివరికి ఎన్నో భారీ ఆశలు పెట్టుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’( Adipurush ) చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం సాధించింది.బయ్యర్స్ ఆ నష్టాల నుండి ఇప్పట్లో కోలుకుంటారో లేదో తెలియదు కానీ, రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’( Samajavaragamana Movie ) చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

మొదటి రెండు రోజులు సరైన ఓపెనింగ్స్ లేక తడబడిన ఈ చిత్రం, మూడవ రోజు నుండి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తన విశ్వరూపం ని చూపించడం మొదలు పెట్టింది.ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల 20 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది.

Telugu Ak, Sree Vishnu, Anil Sunkara-Movie

నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇక ఐదవ రోజు కూడా ఈ చిత్రానికి మొదటి రోజు కంటే కూడా ఎక్కువ వసూళ్లు వచ్చాయి.ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా కి 5 వ రోజు 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.అలా పెట్టిన డబ్బులకు డబుల్ మార్జిన్ లాభాలను కేవలం 5 రోజుల్లోనే చూపించింది ఈ చిత్రం.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని( Overseas Rights ) కొనుగోలు చేసిన బయ్యర్స్ కి జాక్పాట్ తగిలిందనే చెప్పాలి.అక్కడ ఈ చిత్రానికి సంబంధించి కేవలం అమెరికా రైట్స్ 25 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది.

ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ నాలుగు లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లు వచ్చాయి.

Telugu Ak, Sree Vishnu, Anil Sunkara-Movie

అంటే నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట, అక్కడ థియేటర్స్ అన్నీ కమిషన్ బేసిస్ మీదనే రన్ అవుతాయి కాబట్టి, నాలుగు లక్షల గ్రాస్ కి ఎంత లేదు అనుకున్నా రెండు కోట్ల రూపాయిల వరకు షేర్ ఉంటుంది.అంటే 25 లక్షలకు రైట్స్ ని కొనుగోలు చేసి 75 లక్షల రూపాయిలు లాభాల్ని అందుకున్నారు అన్నమాట.అందుకే ఈ సినిమా బయ్యర్స్ పాలిట జాక్పాట్ లాంటిది అని అందరూ అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర( Anil Sunkara ) నిర్మించాడు.ఈయన గత చిత్రం ‘ఏజెంట్’( Agent Movie ) బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

సుమారుగా నిర్మాత 40 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయాడు.ఆ నష్టాన్ని మొత్తం ఈ చిత్రం ఫుల్ రన్ లో పూడుస్తుంది అని మాత్రం చెప్పలేము కానీ, కొంతవరకు ఆయనకీ లాభాలు వస్తాయని మాత్రం చెప్పగలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube