తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ( YSRTP ) పెట్టి మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన షర్మిల( YS Sharmila ) రాజకీయ ప్రయాణం ప్రస్తుతం సంధి కాలంలో ఉన్నట్లుగా తెలుస్తుంది.రాజన్న వారశురాలిగా ఆయన రాజ్యాన్ని తీసుకువస్తానని తెలంగాణను అభివృద్ధి పథంలో నిలబెడతానని ఆమె ఎన్ని వాగ్దానాలు చేస్తున్న తెలంగాణ ప్రజానీకం నుంచి ఆశించిన స్పందన అయితే రాలేదన్నది వాస్తవం.
దాంతో ఆమె రాజకీయ ప్రయాణానికి కాంగ్రెస్ను ఆలంబనగా తీసుకోబోపోతున్నారని వార్తలు వచ్చాయి.ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాభల్యం ఉన్న ఖమ్మం జిల్లా నుంచి ఆమె పోటీ పడడానికి చూస్తున్నారని దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా సిద్ధంగానే ఉందని, తన పార్టీని విలీనం చేస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్( Congress Party ) సిద్ధంగా ఉంది అన్న విశ్లేషణలు గతం లో వచ్చాయి .
అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని షరతుల తో పార్టీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారం లోకి తీసుకురావడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి వర్గం షర్మిల టి .కాంగ్రెస్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఆమెకు ఆంధ్ర కాంగ్రెస్లో నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పినా పరవాలేదని, కానీ తెలంగాణ లో మాత్రం ఆమె రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తుందని, ఆంధ్రమూలాలు ఉన్న ఏ వ్యక్తులతో మనం కలిసి నడిచినా కూడా అది కెసిఆర్ కు అస్త్రాన్ని అందించినట్లుగా ఉంటుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆలోచనలో పడిన కేంద్రం షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఆమెకు కొత్త షరతులు విధించిందని తెలుస్తుంది.
గతంలో చంద్రబాబుతో కలిసి నడిచి నష్టపోయిన కాంగ్రెస్ మరోసారి ఆ రిస్క్ తీసుకోకూడదనే భావిస్తున్నదట .అందువల్ల ఆంధ్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్ప చెప్తామని రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు తీసుకోమని షర్మిలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.మరి ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయానికి మొదటి నుంచి విముఖంగా ఉన్న షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయం ఈ నెల 8వ తారీఖున ఒక అంచనా కు రావచ్చని ఎందుకంటే ఆ రోజు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావటం తో ఆమె తన బవిష్యత్తు కార్యాచరణ ప్రకటించవచ్చు అని తెలుస్తుంది.