భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో వన్ అఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ధనుష్( Dhanush )తన విలక్షణమైన నటనతో, కొత్త కొత్త కదాంశాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆసచర్యపరుస్తూ ఉంటాడు.ధనుష్ యాక్టర్ మాత్రమే కాదు…ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్ కూడా.
డబ్బు, పేరు, పలుకుబడి, మంచి కుటుంబం.అన్ని ఉన్నాయ్ ఈయన జీవితంలో.
కానీ ఆ ఒక్కటే కరువయిందట.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మనసులో మాటను బయట పెట్టి ఎమోషనల్ అయ్యాడు ధనుష్.
హీరో ధనుష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమాలు చేయడం వలన మీరు ఏమైనా మిస్ అవుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు.తాను ఎన్ని డబ్బులు సంపాదిస్తున్న హీరో గా డైరెక్టర్గా సినీ రంగంలో ఉండటం వలన తన కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నాని బాధ పడ్డాడు.తన ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్ళైపోతారని, తానూ ఎప్పుడు షూట్ లో బిజీ గా ఉంటానని అందుకే కుటుంబం తో కలిసి సరదాగా సమయాన్ని గడపలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.అయితే ఇది కష్టపడాల్సిన సమయం అని, వయసైపోయాక కసటపడాలన్న కుదరదని అన్నారు.
తాను ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కాబట్టి పర్వాలేదని తనకి తానె సర్ది చెప్పుకున్నాడు.
ధనుష్ ఇప్పటివరకు సుమారు 50 చిత్రాలలో నటించాడు.నాలుగు నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాడు.ధనుష్ ఖాతాలో ఒక ఫిలింఫేర్ అవార్డు, ఏడు సౌత్ ఫిలింఫేర్ అవార్డులు, 10 విజయ అవార్డులు, 13 సైమా అవార్డులు కూడా ఉన్నాయ్.
ధనుష్ ప్రస్తుతం అరుణ్ మాతేశ్వరం దర్శకత్వం లో కెప్టెన్ మిల్లర్( Captain Miller ) చిత్రంలో నటిస్తున్నాడు.ప్రియాంక మోహన్ ( Priyanka Mohan )హీరోయిన్.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతుంది.
ఈ సినిమాలో సందీప్ కిషన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ చిత్రం తరువాత ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం.
ఈ చిత్రం 2024 లో సెట్స్ పైకి వెళ్లనుంది.