Hari Krishna : నందమూరి హరికృష్ణ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే…!

అన్నగారు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు హరి కృష్ణ( Hari Krishna )ఆయన కెరీర్ లో చేసిన సినెమలు తక్కువే కానీ ఒక వైపు హీరోగా, మరో వైపు సహాయ నటుడిగా అన్ని విధమైన పాత్రలను చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరి కృష్ణ.టైగర్ హరి కృష్ణ కెరీర్ లో మోస్ట్ మెమొరబ్లె సినిమాలు యేవో ఇప్పుడు చూద్దాం.

 Harikrishna Best Movies In His Career-TeluguStop.com

1.సీతయ్య

Telugu Hari Krishna, Harikrishna, Lahirilahiri, Nagarjuna, Seetayya, Tollywood-M

ఎవరి మాట వినడు సీతయ్య( Seetayya )ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలుసు.హరి కృష్ణ గారి కెరీర్ లో అద్భుతమైన విజయాన్ని సాధించిన సినిమా సీతయ్య.పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో హరి కృష్ణ గారి నటన అందరిని ఆకట్టుకుంది.

ఈ చిత్రం 2003 లో విడుదల అయ్యింది.వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు.

2.లాహిరి లాహిరి లాహిరిలో

Telugu Hari Krishna, Harikrishna, Lahirilahiri, Nagarjuna, Seetayya, Tollywood-M

2002 లో విడుదలైన ఈ చిత్రానికి కూడా వైవీఎస్ చౌదరి గారే దర్శకత్వం వహించారు.ఇది ఒక ఫామిలీ డ్రామా.ఈ సినిమాలో కృష్ణమ నాయుడు గా హరి కృష్ణ గారు చేసిన పాత్రకు ఆయనకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో నంది అవార్డు లభించింది.

3.దాన వీర సూరా కర్ణ

ఎన్ టీ రామారావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977 లో విడుదలయింది.

ఈ చిత్రం లో తన తండ్రి తో కలిసి నటించారు హరి కృష్ణ.రామారావు గారు కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హరి కృష్ణ గారు అర్జునుడి పాత్ర పోషించారు.

4.సీతారామరాజు

ఈ సినిమాలో నాగార్జున గారితో కలిసి నటించారు హరి కృష్ణ.అన్నదమ్ముల అనుబంధం నేపధ్యం లో తెరకెక్కిన సినిమా ఇది.సీతయా పాత్రను హరి కృష్ణ గారు, రామరాజు పాత్రను నాగార్జున గారు పోషించారు.వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1999 లో విడుదల అయ్యింది.

5.టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్

Telugu Hari Krishna, Harikrishna, Lahirilahiri, Nagarjuna, Seetayya, Tollywood-M

రైతుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా 2003( Tiger Harischandra Prasad ) లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సముద్ర.టైటిల్ రోల్ లో నట విశ్వరూపం చూపించారు హరి కృష్ణ గారు.వీటితో పాటు మరెన్నో మరపు రాణి చిత్రాలలో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు స్వర్గీయ నందమూరి హరి కృష్ణ గారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube