షోలో రెచ్చిపోయిన గుప్పెడంత మనసు జోడి.. జగతితో మహేంద్ర రొమాన్స్

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ మా లో ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకొని నెంబర్ వన్ రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఈ సీరియల్లో జగతి, మహేంద్ర, రిషి, వసుదారలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

 Guppedanta Manasujadi Mahendra And Jagati Romance In Show , Guppedanta Manasu ,-TeluguStop.com

ఇక ఈ సీరియల్ ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్న ఈ సెలబ్రిటీలు తాజాగా స్టార్ మా పరివార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రచార కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి గుప్పెడంత మనసు సీరియల్ , అదే విధంగా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ నుంచి సెలబ్రిటీల హాజరయ్యి పోటాపోటీగా పలు టాస్క్ లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా మహేంద్ర, జగతి మధ్య రొమాన్స్ మితిమీరి పోయిందనే చెప్పాలి.వీరిద్దరు ఎంతో రొమాంటిక్ పాటలకు డాన్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.

అదేవిధంగా వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో స్క్రీన్ పై కొన్ని స్టిల్స్ చూయించారు.అదే విధంగా వీరిద్దరూ అదే స్టిల్స్ చేయడంతో ఇది కాస్తా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగతి మహేంద్రకు పోటీగా రిషి, వసుధారా కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక వీరిద్దరూ కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ మా చూపు మాత్రం జగతి మహేంద్ర జంట పైనే ఉంది అంటూ ఎన్నెన్నో జన్మల బంధం టీమ్ వారి పై ప్రశంసలు కురిపించారు.

ఈ విధంగా జగతి మహేంద్ర మధ్య రొమాన్స్ అదిరిపోయిందని ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదాన్ని చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ఇక రిషి వసుధార జగతి వీరందరూ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వారు అనే సంగతి మనకు తెలిసిందే ఇక సాయికిరణ్ అలియాస్ మహేంద్ర ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా నువ్వేకావాలి సినిమాలోని అనగనగా ఆకాశం ఉంది అనే పాట ద్వారా సాయి కిరణ్ ఒక్కసారిగా మంచి గుర్తింపును సంపాదించు కున్నారు.అయితే ప్రస్తుతం ఈయన వెండి తెరకు దూరం అయిన తెలుగు కన్నడ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.

Guppedanta Manasujadi Mahendra And Jagati Romance In Show

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube