రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లేనా?

రాజకీయాల్లో ఆరోపణలు ప్రతి ఆరోపణలు మామూలే అయినా కొన్నిసార్లు మన టైం బాగోకపోతే వాటికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.ఇప్పుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఈ విషయంలో అది నిరూపితం అవుతుంది .

 Gujarath Court Shock To Rahul Gandi , Rahul Gandi ,modi, Sessions Court Of Gujar-TeluguStop.com

చట్టం కొంతమంది విషయంలో వేగంగాను కొంతమంది విషయంలో నెమ్మదిగాను పనిచేస్తుందా అన్న అనుమానాలు వచ్చేటట్లుగా రాహుల్ గాంధీ విషయంలో పరిణామాలు జరుగుతున్నాయి.నిజానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మించి అనేక తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులను మనం రోజువారి సామాజిక జీవనంలో చూస్తున్నాం.

అయినప్పటికీ రాహుల్ గాంధీ ఆరోపణల పై కోర్టులు కఠినంగా వ్యవహరించడం గమనార్హం.

Telugu Congress, Gujarathshock, Modi, Rahul Gandi, Gujarat-Telugu Political News

దొంగలందరికి మోడీ ( Modi )ఇంటిపేరు ఎందుకుంటుంది అన్న రాహుల్ వాఖ్యల పై బిజెపి నేత ఒకరు వేసిన కేసుతో రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాలు శిక్ష విధించిన గుజరాత్ సెషన్స్ కోర్ట్( Sessions Court of Gujarat ) తీర్పు దేశ రాజకీయాలలో సంచలనం గా మారింది .ఆ తీర్పుపై ఇప్పటికే రెండుసార్లు న్యాయస్థానాల్లో రాహుల్ గాంధీకి చుక్కేదురయింది .మరోపక్క పార్లమెంట్లో కూడా అతని లోక్సభ స్థానానికి వెకెండ్ బోర్డు పెట్టేసింది పార్లమెంట్ క్రమ శిక్షణా కమిటీ .ఇలా శిక్ష పడిందో లేదో అలా అతని ఎంపీ స్థానం ఖాళీ అయిపోయింది .అతని బంగ్లా కాళీ చేసేశారు .ఇక సుప్రీంకోర్టు మాత్రమే రాహుల్ కు ఫైనల్ అవకాశంలా కనిపిస్తుంది .సుప్రీంకోర్టులో కూడా రాహుల్కు అనుకూల తీర్పు రాకపోతే మాత్రం అతను ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించబడతారు .ఇది గాంధీ కుటుంబానికి మరియు కాంగ్రెస్ పార్టీకి( Congress party ) అతిపెద్ద దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది.

Telugu Congress, Gujarathshock, Modi, Rahul Gandi, Gujarat-Telugu Political News

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయని అంచనాలున్న నేపథ్యంలో ప్రధాన పదవి అభ్యర్థికి ఇటువంటి పరిస్థితి ఉండటం రాజకీయ చిత్రంగానే చెప్పుకోవాలి.రాజు లేని సైన్యం పోరాటం లా కాంగ్రెస్ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తుంది .మరి సుప్రీంకోర్టులో అయినా రాహుల్ కి ఊరట దక్కుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube