మహేశ్వర్ రెడ్డిపై మండిపడ్డ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) మతిలేని మాటలపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( Government Whip Birla Ailaiah ) మండిపడ్డారు.మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల పైన మాట్లాడే అర్హత మహేశ్వర్ రెడ్డికి లేదన్నారు.40% కమీషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీకి ఉందన్నారు.కర్ణాటకలో కమీషన్ల పర్సెంటేజ్ వల్ల బీజేపీ చిత్తుగా ఓడిపోయిందన్నారు.

 Government Whip Birla Ailaiah Angry With Maheshwar Reddy-TeluguStop.com

అవినీతి పరుడైన గాలి జనార్ధన్ రెడ్డి, యడ్యూరప్పను బీజేపీ( BJP )లోకి తిరిగి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.సిబిఐ,ఈడి,ఐటి సంస్థలతో వ్యాపారకంపెనీలను బెదిరించి 6000 కోట్ల బాండ్లు బీజేపీ సేకరించిందని ఆరోపించారు.

మీరు సేకరించిన బాండ్ల భాగోతాన్ని సుప్రీంకోర్టు బయట పెట్టిందని తెలిపారు.ధరణిపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే అన్నారు.

రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాలని మహేశ్వర్ రెడ్డి రోజుకో డ్రామా ఆడుతున్నారన్నారు.ఆయన ఒక శాసనసభ పక్ష నేతగా ఉన్నట్లు వాళ్ళ ఎమ్మెల్యేలే గుర్తించడం లేదన్నారు.

రాజాసింగ్ ఏ పార్టీలో ఉన్నాడో మహేశ్వర్ రెడ్డి చెప్పాలన్నారు.ధరణిపై ఆరుగురు సభ్యులతో కమిటీ వేసి ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని,ధరణి పోర్టల్ సమస్యలు తీర్చడానికి 10 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి సుమారు రెండు లక్షల అప్లికేషన్లను పరిష్కరించింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలన చూసి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు,మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన,మంత్రులపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube