అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్( Head Constable Amboju Anil Kumar ) ను మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో రాచకొండ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.
ఫిబ్రవరి నెలలో 22 నుంచి 25 వరకు థాయ్ ల్యాండ్ దేశంలో జరిగిన 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2024 ( AMA )లో 45 సంవత్సరాల విభాగంలో నాలుగు పతకాలు (1బంగారు పతకం,3 కాంస్య పతకాలు) సాధించడం జరిగిందన్నారు.అందులో 4×400 మీటర్లు రిలే లో బంగారు పతకం మరియు 800 మీటర్లు,1500 మీటర్లు, 5000 మీటర్లు పరుగు పందంలో కాంస్యం పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు.
ఇలాగే రాబోయే రోజులలో మరిన్ని పతకాలు సాధించి పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డిసిపి ఎం.రాజేష్ చంద్ర,ఏఆర్ అడిషనల్ డిసిపి బి.వినోద్ కుమార్,ఏసిపి సిహెచ్.మహేశ్వర్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, ఎం.శేఖర్,సిహెచ్.శ్రీకాంత్, డి.శ్రీనివాస్ ఇతర పోలీసు ఉన్నత అధికారులు అభినందించారు.







