హోలీ పండుగను దేశవ్యాప్తంగా కులమతాలకతీతంగా ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటారు.పర్యావరణానికి హాని కలగనటువంటి రంగులను ఉపయోగిస్తూ ఎంతో సంతోషంగా ఈ పండుగను దేశం మొత్తం జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే.
అయితే ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను నిర్వహించుకుంటారు.ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 29న ఈ హోలీ పండుగను నిర్వహించుకుంటారు.
అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాలలో ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి.ఈ విధమైనటువంటి ప్రాంతాలలో వారణాసి ఒకటి.
ప్రతి సంవత్సరం వారణాసిలో హోలీ పండుగ ఐదు రోజులు ముందు నుంచి హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి.ఈ ఏడాది కూడా వారణాసిలో బుధవారం నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి.
కాశీలోని పార్వతీ పరమేశ్వరుడి విగ్రహాలపై భక్తులు రంగులు జల్లి హోలీ వేడుకలను నిర్వహించుకుంటారు.అయితే ఈ విధంగా స్వామివారి విగ్రహాలపై రంగులు చల్లుకోవడం వెనుక కూడా ఒక కథ ఉంది.
పురాణాల ప్రకారం విశ్వనాథుడు ఈ ఏకాదశి రోజున అమ్మవారిని తీసుకొని హిమాలయ పర్వతం నుంచి కాశీ నగరానికి వస్తారు.ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు హిమాలయాల నుంచి కాశీకి చేరుకున్న సమయంలో భక్తులు ఆనందోత్సాహాలతో రంగులను చల్లుతూ పండుగను నిర్వహించుకున్నారనీ పురాణాలు చెబుతున్నాయి.
కాశీలోని ఈ విధమైనటువంటి హోలీ వేడుకలు నిర్వహించుకోవడం గత 357 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.ఈ వేడుకలలో భాగంగా భక్తులు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఉరేగిస్తూ స్వామి వారి విగ్రహాల పై రంగులు చల్లుతూ కుల,మతాలకు అతీతంగా అక్కడి ప్రజలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ హోలీ పండుగను నిర్వహించుకుంటారు.ఇప్పటికి కూడా అక్కడి ప్రజలు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ హోలీ పండుగను నిర్వహించుకుంటారు.ఈ విధమైన హోలీ పండుగకు 357 సంవత్సరాల చరిత్ర ఉందని,ఈ వేడుకలకు ఆలయ సంప్రదాయ పూజారి సారధ్యం వహిస్తారనీ ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
DEVOTIONAL