భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వండి:శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ పార్టీ నుండిభువనగిరి( Bhuvanagiri ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమరవీరుడు శ్రీకాంతా చారి ( Kasoju Srikanth Chary )తల్లి శంకరమ్మ కోరారు.గురువారం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 Give Bhuvanagiri Mp Ticket: Srikantachari's Mother Shankaramma-TeluguStop.com

అనంతరం ఆమె మాట్లాడుతూ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు.బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ( KCR )ను కోరానని,పార్టీలు తనపై పోటీకి అభ్యర్థులను నిలబెట్టవద్దని కోరారు.

తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు పదేళ్లయినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యిమంది అమరులయ్యారని, వారిలో తన కొడుకు కూడా ఒకరని శంకరమ్మ చెప్పారు.

వారి కుటుంబాలకు ఎలాంటి పదవులు లభించలేదన్నారు.తెలంగాణ ఉద్యమం( Telangana Movement )లో పనిచేయనివారు మాత్రం మంత్రులు,ఎమ్మెల్యేలు అయ్యారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube