నేటి నుండి దేశమంతా ఎన్నికల సంఘం అధీనంలోకి...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం శనివారం లోక్ సభ,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.

దీనితో నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం,ఒడిస్సా,అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి.

From Today, The Entire Country Will Be Under The Control Of The Election Commiss

ఆంధ్రప్రదేశ్ లో మే 13 న పోలింగ్ జూన్ 4 న కౌంటింగ్,7 దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతాయి.దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.కొత్తగా కోటి 80 లక్షల మంది నమోదయ్యారు.12 రాష్టాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎం ఉపయోగించనున్నారు.10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా కోటి 50 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తారు.85 ఏళ్ళు దాటినా వారికి, దివ్యాంగులకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం ఉంటుంది.దేశంలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు,47.1 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు.తొలిసారిగా 1.85 కోట్ల మంది యువత ఓటు వేయనున్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ నియంత్రణకి ప్రత్యేక అధికారులను నియామకం చేస్తున్నారు.

వాలెంటీర్స్,తాత్కాలిక ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని తేల్చి చెప్పారు.ఈమధ్య జరిగిన ఎన్నికల్లో 3400 కోట్ల రూపాయలను సీజ్ చేసామని, బ్యాంకు అకౌంట్స్ లావాదేవులపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

Advertisement

ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలో దిగనున్నాయి.

Advertisement

Latest Nalgonda News