తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి చెక్ అందజేత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా :గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.కోనరావుపేట మండలం బావుసాయిపేట కి చెందిన ఓ వ్యక్తి మూడు నెలల క్రితం గల్ఫ్ (బహరేన్) లో ప్రమాదవ శాత్తు మృతి చెందగా వారి కుటుంబం కి రూ.5 లక్షల ఎక్సగ్రేసియా చెక్కును ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అందజేశారు.వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోనే గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పిన విధంగా మొదటి చెక్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.గల్ఫ్ కార్మికుల సమస్యల పై ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టామని, గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.
గత బిఅర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో 2 వేల మంది మరణించిన గల్ఫ్ కుటుంబాలను పట్టించులేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో గల్ఫ్ కార్మికులు చనిపోతే మొట్ట మొదటి సారిగా వేములవాడ నియోజక వర్గం లోని బావుసాయిపేట, మర్రిపల్లి కుటుంబాకు ఇస్తున్నామని అన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే ధ్యేయం అన్నారు.గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అన్నారు…







