ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నేతలు జాయిన్ అయ్యే పరిస్థితి నెలకొంది.
ఈ రకంగానే ఇటీవల ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ( TDP )లో కీలక నేతగా రాణించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో జాయిన్ అవటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.నిన్న వైయస్ జగన్ తో కూట భేటీ కావడం జరిగింది.
ఇక అదే రోజు వైసీపీ పార్టీ( YCP )లో జాయిన్ అయి వారం రోజులు గడవకముందే రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా టీడీపీ నేత తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్( Swamy Das ) నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది.
సీఎం జగన్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు.కేశినేని నాని( Kesineni Nani ) అనుచరుడిగా స్వామిదాస్ కి తిరువూరు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని నాని వైసీపీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.1994, 1999 ఎన్నికలలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిదాస్.ఆ తర్వాత 2004, 2009, 2014 ఎన్నికలలో ఓటమిపాలయ్యారు.నిన్ననే కేశినేని నాని జగన్ తో భేటీ అనంతరం.మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ కాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో ఆయన అనుచరుడిగా పేరొందిన నల్లగట్ల స్వామి దాస్ వైసీపీలో జాయిన్ అవ్వటం సంచలనంగా మారింది.